రష్యా సైనికుల్ని రేప్ లు చేయమని ప్రోత్సహిస్తున్న భార్యలు-జెలెన్ స్కీ భార్య సంచలనం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది కావస్తోంది. అయినా ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో రష్యా సైనికుల దురాగతాలు కూడా పెరిగిపోతున్నాయి. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్ స్కా ఇవాళ దీనిపై స్పందించారు.
యుద్ధాలు, అల్లర్ల సమయంలో లైంగిక నేరాల్ని ఎలా అరికట్టాలన్న అంశంపై లండన్ లో జరుగుతున్న ఓ అంతర్జాతీయ సదస్సులో ఉక్రెయిన్న ప్రథమ మహిళ జెలెన్ స్కా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో రష్యా సైనికులు చేస్తున్న దురాగతాల్ని ఆమె గుర్తుచేశారు. యుద్ధంలో పోరాటం అనేది సహజమే అయినా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం ద్వారా రష్యా సైనికులు జెనీవా ఒప్పందం సహా అన్ని సహజ సూత్రాల్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆమె ఆరోపించారు.

మరోవైపు రష్యా సైనికులు ఉక్రెయిన్ లో మహిళలపై అత్యాచారాలు చేయడానికి వారి భార్యలే ప్రోత్సహిస్తున్నారని జెలెన్ స్కా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి రష్యా సైనికులు బహిరంగంగానే ఈ లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు ఆమె ఆరోపించారు. ప్రత్యర్ధులపై ఆధిపత్యం కోసం లైంగిక హింసను ఆయుధంగా మార్చుకోవడం అత్యంత క్రూరమైన విషయమని జెలెన్ స్కా విమర్శించారు. యుద్ధ సమయంలో జరిగే ఇలాంటి నేరాల్ని బాధితులు బయటికి చెప్పుకోలేరని ఆమె వివరించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications