పాక్ కు షాక్ ఇచ్చిన శ్రీలంక: దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే
కొలంబో: ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి పొరుగు దేశాలకు ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్ కు శ్రీలంక పెద్ద షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న సార్క్ సమావేశాలకు వెళ్లకూడదని శ్రీలంక నిర్ణయించింది.
తామ సార్క్ సమావేశాలకు వెళ్లడం లేదని శ్రీలంక విదేశాంగ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు సార్క్ సమావేశాలకు వెళ్లకూడాదని ఐదు దేశాలు నిర్ణయించాయి.
పాక్ ను ఏకాకిని చెయ్యాలని భారత్ వేసిన ప్లాన్ సక్సస్ అయ్యింది. భారత్ బాటలోనే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, భూటాన్ దేశాలు పయనించాయి. వివిధ కారణాలతో తాము సార్క్ సమావేశాలకు హాజరు కావడంలేదని కచ్చితంగా తేల్చి చెప్పారు.

ఆ దేశాలు భారత్ కు మద్దతు తెలిపిన తరువాత ఆలిస్టులో శ్రీలంక చేరింది. అక్టోబర్ 9,10 తేదీలలో పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో సార్క్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సార్క్ సమావేశాలకు వెళ్లేది లేదని ఐదు దేశాలు స్పష్టంగా చెప్పాయి.
సార్క్ సమ్మిట్ కు అధ్యక్షస్థానంలో ఉన్న నేపాల్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదు. సరైన సమయంలో సార్క్ సమావేశాలు నిర్వహించాలని, అన్ని దేశాలు సహకరించాలని నేపాల్ మనవి చేసింది.
ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ తో పాటు కేవలం అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్, మాల్దీవులు మాత్రమే సార్క్ సమావేశాల్లో పాల్గొనే పరిస్థితి ఎదురైయ్యింది. మాల్దీవులు ఇప్పటి వరకు నోరు విప్పలేదు. మాల్దీవులు సార్క్ సమావేశాలకు హాజరుకాకపోతే పాక్ ను ఏకాకిని చేయ్యాలని భావిస్తున్న భారత్ కు కచ్చితంగా విజయం విరిస్తుంది. ఈ సందర్బంలో నేపాల్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications