ఊహించలేదు: సభలోనే ప్రపోజ్ చేసిన 'గే' ఎంపీ, ఆ బిల్లు పాసయ్యాక!..

Subscribe to Oneindia Telugu

మెల్‌బోర్న్‌: ఇటీవల పలు దేశాలు గే వివాహాలకు ఆమోదం తెలుపుతూ చట్టాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. డెన్మార్క్ తొలుత దీనికి నాంది పలకగా.. మొట్టమొదటిసారిగా ఓటింగ్ ద్వారా ఐర్లాండ్ లోను అమలులోకి వచ్చింది. ఆసియాలో మొట్టమొదటిసారిగా తైవాన్ 'గే' వివాహా చట్టాన్ని తెచ్చింది.

'గే' వివాహాలకు చట్టబద్దత!: తీర్పుపై తైవాన్‌లో ఉత్కంఠ..

తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా గే వివాహాల చట్టబద్దతకు తాజాగా బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా దీనిపై ఆసక్తికర చర్చ జరగ్గా.. ఇద్దరూ ఎంపీలు సభలోనే ప్రపోజ్ చేసుకోవడం గమనార్హం.

సభలోనే ప్రపోజ్:

సభలోనే ప్రపోజ్:

ఆస్ట్రేలియా హౌస్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌లో స్వ‌లింగ వివాహాలను చ‌ట్ట‌బ‌ద్ధం చేసిన బిల్లుపై చర్చిస్తుండగా ఎంపీ టిమ్ విల్స‌న్ భావోద్వేగానికి లోనయ్యాడు. బిల్లు పాసవబోతున్న క్షణంలో తన తోటి 'గే' సహచరుడు ఎంపీ రాయన్ ప్యాట్రిక్ బోల్జర్ సభలోనే ఉండటం దీనికి కారణం. సభలో తన ప్రసంగం చివర.. 'ఇక మిగిలింది ఒక్కటే.. నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని భావోద్వేగంతో టిమ్ విల్సన్ ప్యాట్రిక్ కు ప్రపోజ్ చేశాడు.

సభలో హర్షధ్వానాలు:

సభలో హర్షధ్వానాలు:

టిమ్ విల్సన్ ప్రపోజల్‌కు ప్యాట్రిక్ నుంచి ఔను అని సమాధానం రావడంతో సభ్యులు హర్షధ్వానాలు చేశారు. ఆపై డిప్యూటీ స్పీకర్‌ రాబ్‌ మిచెల్ల్‌ ఆ జంటకు అభినందనలు తెలియజేస్తూ ఇది ఎంతో అరుదైన క్షణం అని వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట.. స్వలింగ వివాహాలపై నిషేధం కారణంగా పెళ్లి చేసుకోలేకపోయారు. తాజా బిల్లుతో త్వరలోనే ఆ నిషేధం ఎత్తివేయనుండటంతో టిమ్ పెళ్లి ప్రపోజ్ చేశాడు. గతవారమే అక్కడి ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించగా.. తాజాగా దిగువ సభలోను ఆమోదం రావడంతో త్వరలోనే చట్టం అమలులోకి రానుంది.

 ఓటింగ్ ద్వారా ఐర్లాండ్ లో:

ఓటింగ్ ద్వారా ఐర్లాండ్ లో:

గే వివాహాల చట్టబద్దతపై ఐర్లాండ్ ప్రభుత్వం నిర్వహించిన రిఫరెండంలో ఏకంగా 70 శాతం మంది ప్రజలు దీనికి అనుకూలంగా ఓటేశారు. దీంతో ఓటింగ్ ఆధారంగా గే వివాహాలకు చట్టాన్ని రూపొందించిన తొలిదేశంగా ఐర్లాండ్ నిలిచింది. గే వివాహాలకు చట్టబద్దత కల్పించిన దేశాల్లో ఐర్లాండ్ 22వది కావడం గమనార్హం. సాంప్రదాయవాదులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

 ఈ ఏడాది తైవాన్ లో:

ఈ ఏడాది తైవాన్ లో:

స్వలింగ సంపర్కుల(గే) వివాహాలను చట్టబద్దం చేసిన తొలి ఆసియా దేశంగా తైవాన్ చరిత్రలోకి ఎక్కింది. అక్కడి అత్యున్నత న్యాయస్థానం గే వివాహాలకు చట్టబద్దత కల్పిస్తూ ఈ ఏడాది మే నెలలోనే చట్టాన్ని తీసుకొచ్చింది. తైవాన్ ప్రధాని కూడా గే వివాహాల కోసం పోరాడుతున్నవారి కోసం మద్దతు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Liberal MP Tim Wilson has proposed to his long-term partner Ryan Bolger in the House of Representatives, shortly after the same-sex marriage bill was introduced to the Lower House.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి