Gold Mines: బయటపడ్డ భారీ బంగారు నిధి!

ప్రపంచానికి చమురు అంటే గుర్తొచ్చే మొదటి పేరు సౌదీ అరేబియా. కానీ ఇప్పుడు అదే దేశం మరో అరుదైన సంపదతో గ్లోబల్ మార్కెట్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సౌదీ అరేబియాలో భారీ స్థాయిలో కొత్త బంగారు నిక్షేపాలు వెలుగు చూశాయి. దేశంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో కలిపి సుమారు 78 లక్షల ఔన్సుల బంగారం కొత్తగా గుర్తించినట్లు ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ మాడెన్ (Maaden) అధికారికంగా ప్రకటించింది.

సౌదీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత అన్వేషణ, డ్రిల్లింగ్ కార్యక్రమాల ఫలితంగా ఈ విలువైన లోహ సంపద బయటపడింది. ముఖ్యంగా మంసూరా–మస్సారా, వాడి అల్ జౌ, ఉరుక్, ఉమ్ అస్ సలాం ప్రాంతాల్లో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు మాడెన్ వెల్లడించింది. ఈ ప్రాంతాలు అరేబియన్ షీల్డ్‌లో భాగంగా ఉండటం గమనార్హం. ఇప్పటికే ఖనిజ సంపదకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఇంకా అపారమైన వనరులు దాగి ఉన్నాయన్న సంకేతాలను ఈ ఆవిష్కరణలు ఇస్తున్నాయి.

Saudi Arabia Strikes Gold Massive New Gold Reserves Discovered Across Key Regions

ఈ తాజా కనుగొనుగుళ్లతో మంసూరా–మస్సారా గనిలో మొత్తం బంగారు నిల్వలు దాదాపు 1.04 కోట్ల ఔన్సులకు చేరుకున్నాయి. ఇది సౌదీ మైనింగ్ రంగానికి చారిత్రక మైలురాయిగా నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని డ్రిల్లింగ్ పనులు చేపడితే ఈ నిల్వలు ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

రాగి, నికెల్ నిక్షేపాలు కూడా..

ఇది కేవలం బంగారంతోనే ఆగడం లేదని సౌదీ అధికారులు చెబుతున్నారు. అరేబియన్ షీల్డ్ ప్రాంతంలో రాగి, నికెల్ వంటి ఇతర లోహాలపై కూడా అన్వేషణ కొనసాగుతోంది. అయితే తాజా ప్రకటనలో ప్రధానంగా బంగారు నిక్షేపాల గురించే అధికారిక ధృవీకరణ లభించింది.

మైనింగ్‌ను దేశ ఆర్థిక వ్యవస్థలో..

ఈ పరిణామం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టిన విజన్ 2030 వ్యూహానికి కీలక బలాన్ని ఇస్తోంది. చమురు మీద ఆధారాన్ని తగ్గించి, మైనింగ్‌ను దేశ ఆర్థిక వ్యవస్థలో మూడో కీలక స్థంభంగా మార్చాలన్నదే ఈ విజన్ లక్ష్యం. మాడెన్ సీఈఓ బాబ్ విల్ట్ మాట్లాడుతూ… “ఈ ఫలితాలు మా దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనం. సౌదీ భూభాగంలో ఇంకా ఎన్నో ఖనిజ సంపదలు వెలుగులోకి రావాల్సి ఉంది” అని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తానికి, చమురు రాజ్యంగా పేరున్న సౌదీ అరేబియా… ఇప్పుడు బంగారు సంపదతోనూ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఆవిష్కరణలు భవిష్యత్తులో ప్రపంచ పసిడి మార్కెట్‌పై సౌదీ ప్రభావాన్ని మరింత పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+