పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేపట్టడంతో ప్రతీకారంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి వేసింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో మునిగిపోయాయి. ప్రపంచ దేశాలతోపాటు పాకిస్థాన్ సైతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అనేక ఇబ్బందులకు గురైంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు గుడ్ న్యూస్ చెప్పాయి.
పాకిస్థాన్ ను ఆర్థికంగా ఆదుకునేందుకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ముందుకొచ్చాయి. ఈ మేరకు పాకిస్థాన్ కు 5 బిలియన్ డాలర్లను(రూ. 41,500 కోట్లు) అందించేందుకు సిద్ధం అయ్యాయి. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఈ మేరకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అసలే పాకిస్థాన్ లో విదేశీ మారక నిల్వలు పూర్తిగా పడిపోయాయి. దాంతోపాటు తమకు చెల్లించాల్సిన 3.5 బిలియన్ డాలర్లను వెంటనే చెల్లించాలని యూఏఈ అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ కు తక్షణమే రుణ సాయం అవసరం పడింది. దాంతో 5 బిలియన్ డాలర్లను అందించేందుకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ముందుకొచ్చాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన డాన్ న్యూస్ స్పష్టం చేసింది.
ఇటీవల యూఏఈ పాకిస్థాన్ కు ఫైనల్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. తమకు చెల్లించాల్సిన 3.5 బిలియన్ డాలర్లను తక్షణమే చెల్లించాలని యూఏఈ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్.. ఇరాన్ కు సపోర్ట్ చేస్తోందని భావించిన యూఏఈ ఈమేరకు అల్టిమేటం జారీ చేసింది. దాంతో పాకిస్థాన్ కు ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు సౌదీ అరేబియా, ఖతార్ ముందుకొచ్చాయి.

ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) రూల్స్ ప్రకారం.. పాకిస్థాన్ కు రుణ దాతలుగా ఉన్న సౌదీ అరేబియా, చైనా అలాగే యూఏఈ తమ డిపాజిట్లను అలాగే కొనసాగించాల్సి ఉంటుంది. అయితే తాజా పరిణామాల దృష్ట్యా యూఏఈ స్థానంలో ఖతార్.. పాకిస్థాన్ కు ప్రధాన ఆర్థిక మద్దతుదారుగా మారే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ ప్రస్తుతం వాషింగ్టన్ లో జరిగే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. దాంతో పాకిస్థాన్ కు మరిన్ని నిధులు సమకూరే విధంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ కు సౌదీ అరేబియా, ఖతార్ లు సాయం చేయడం ఆ దేశానికి లైఫ్ లైన్ గా భావించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
-
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications