అమెరికా అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపల ఉన్న సమయంలో, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ వెలుపల ఓ అనూహ్య ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఓ కారు భవనాన్ని రక్షించే సెక్యూరిటీ బ్యారియర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.

మంగళవారం రాత్రి సుమారు 10.30 గంటలకు 17వ, ఈ(E) వీధుల మూలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మేరీల్యాండ్ లైసెన్స్ ప్లేట్‌లతో ఉన్న 2010 అకురా టీఎస్ఎక్స్ (Acura TSX) కారు సెక్యూరిటీ బ్యారియర్‌ను ఢీకొట్టింది. యూఎస్ సీక్రెట్ సర్వీస్ యూనిఫామ్ విభాగం అధికారులు క్షణాల్లో అప్రమత్తమైన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే కారును పూర్తిగా తనిఖీ చేసి.. కారు వల్ల అధ్యక్షుడు ట్రంప్‌కు ఎటువంటి తక్షణ భద్రతా ముప్పు లేదని నిర్ధారించారు.

Security Breach at White House Car Rams Gate While President Donald Trump Inside

భద్రతా ఆందోళనలు, అనుమానాలు
డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, అతడి గుర్తింపు, ఉద్దేశంపై అధికారులు వెంటనే ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా, డ్రైవర్ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వైట్ హౌస్‌ను ఎందుకు సమీపించాడనే వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటన జరిగిన సమయంలో వైట్ హౌస్‌ను లాక్‌డౌన్ చేయనప్పటికీ, భద్రతా సిబ్బంది కారును తొలగించే వరకు గేటుకు దారితీసే రహదారిని మూసివేశారు. కాగా ప్రస్తుతం వైట్ హౌస్ ఈస్ట్ వింగ్‌లో కొత్త బాల్‌రూమ్ నిర్మాణం కోసం కూల్చివేత పనులు జరుగుతుండటం వల్ల ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

వైట్ హౌస్ భద్రతా లోపాలు
వైట్ హౌస్ గేట్లను వాహనాలు ఢీకొట్టడం అరుదైనప్పటికీ, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. 2024 జనవరి, మే నెలల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 2023 మే నెలలో ఒక డ్రైవర్ యు-హాల్ ట్రక్కుతో గేట్‌ను ఢీకొట్టి, అప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపాలనే ప్రణాళికతో వచ్చినట్లు అధికారులకు తెలిపాడు. 1995 ఒక్లహామా సిటీ బాంబు దాడి తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా వైట్ హౌస్ ముందున్న పెన్సిల్వేనియా అవెన్యూను వాహనాల రాకపోకలకు పూర్తిగా మూసివేసి భద్రతా చర్యలు కఠినతరం చేసినప్పటికీ, 1994లో బిల్ క్లింటన్ లోపల ఉండగా కాల్పులు, 2015లో బరాక్ ఒబామా కుటుంబం ఉండగా కంచె దూకడం వంటి భద్రతా ఉల్లంఘనలు జరిగాయి.

రాజకీయ ప్రముఖులపై దాడులు.. పెరుగుతున్న ఆందోళన
ఇటీవలి సంవత్సరాలలో అమెరికాలో రాజకీయ ప్రముఖులపై దాడులు, హత్యాయత్నాల కారణంగా వారి భద్రత తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది అధ్యక్షుడు ట్రంప్‌పైనే రెండు హత్యాయత్నాలు జరిగాయి. అంతేకాకుండా మిన్నెసోటా రాష్ట్ర చట్టసభ సభ్యురాలు మెలిస్సా హార్ట్‌మన్ రాజకీయ హత్యకు గురికావడం, ట్రంప్ మిత్రుడు చార్లీ కిర్క్ కాల్చి చంపబడటం వంటి అనేక హై-ప్రొఫైల్ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు లోపల ఉన్న సమయంలో వైట్ హౌస్ భద్రతా అడ్డంకిని ఒక కారు ఢీకొట్టడం అనేది, అధ్యక్ష భవనం భద్రతా వ్యవస్థను మరింత కఠినతరం చేయవలసిన అవసరాన్ని చెబుతోంది. డ్రైవర్ ఉద్దేశం తెలిసిన తర్వాత భవిష్యత్తు భద్రతా ప్రోటోకాల్స్‌లో మార్పులు రావచ్చని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+