వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను లెస్బియన్: బ్రిటన్ మహిళా మంత్రి సంచలన వ్యాఖ్యలు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ సీనియర్ మంత్రి జస్టిన్ గ్రీనింగ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్వలింగ సంపర్కురాలినని పేర్కొన్నారు. కన్జర్వేటివ్ పార్టీ కేబినెట్‌లో బహిరంగంగా 'లెస్బియన్' అని ప్రకటన చేసిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. తాను స్వలింగ సంపర్కురాలిననే విషయాన్ని ట్వట్టర్‌ ద్వారా వెల్లడించారు.

డేవిడ్ కామెరూన్ ప్రభుత్వంలో యూకే ఇంటర్నేషనల్ డెవల్మెంట్ సెక్రటరీగా ఉన్న జస్టిన్ గ్రీనింగ్స్ బ్రెగ్జిట్ రిఫరెండంలో భాగంగా బ్రిటన్ ఐరోపా యూనియన్‌లోనే కొనసాగాలని ప్రచారం చేశారు. లండన్‌తో పాటు బ్రిటన్ వ్యాప్తంగా జరిగిన స్వలింగ పర్కుల ర్యాలీలకు ఆమె తన మద్దతుని ప్రకటించారు.

Senior UK Minister announces she is gay on London's Pride day

'ఈరోజు ఎంతో మంచిరోజు. నేను స్వలింగ సంపర్కురాలినని చెప్పడానికి సంతోషిస్తున్నా. సంపర్కుల తరపున ప్రచారం చేస్తా. వారికి నా మద్దతు ఉంటుంద'ని పేర్కొన్నారు. కాగా, జస్టిన్ గ్రీనింగ్స్ చేసిన ప్రకటనను బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు.

హ్యారీ పోటర్ రచయిత్రి జేకే రౌలింగ్, యూకే ఛాన్సలర్ జార్జి అసబోర్నె తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు. తాము స్వలింగ సంపర్కులమని బహిరంగంగా ప్రకటించిన హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల్లో 47 ఏళ్ల గ్రీనింగ్స్ 33వ వ్యక్తి కావడం విశేషం. ఇక, ప్రప్రంచ దేశాల్లోని ఏ చట్టసభల్లోనూ ఇంతమంది 'గే'ల మని ప్రకటించుకోలేదు.

English summary
One of Britain’s frontline Cabinet ministers Justine Greening has announced she is in a same-sex relationship, making her the first openly gay woman in the Conservative cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X