భారత్ కు బిగ్ షాక్ ? సార్క్ స్ధానంలో చైనా, పాక్, బంగ్లా కొత్త కూటమి.. !
భారత్ కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేేశ్ కలిపి సార్క్ స్ధానంలో మరో కొత్త కూటమి ఏర్పాటుకు మంతనాలు జరుపుతున్నాయి.
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్) కూటమిలో భారత్ పాటు భాగస్వాములుగా ఉన్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రమంగా మన దేశానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. అంతర్జాతీయ స్ధాయిలో భారత్ కు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సార్క్ కూటమిలో పాకిస్తాన్ ఉందన్న కారణంతో భారత్ దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయ కూటమిని తెరపైకి తెస్తున్నాయి.
సార్క్ కూటమిలో కీలక సభ్య దేశంగా ఉన్న భారత్.. తీవ్రవాదానికి మద్దతిస్తుందన్న కారణంతో గతంలో 2016లో పాకిస్తాన్ ఆతిధ్యమిచ్చిన సమావేశానికి గైర్హాజరైంది. అప్పటి నుంచి సార్క్ కూటమి కార్యకలాపాలు గాడితప్పాయి. దీంతో తాజాగా అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా కుట్రకు తెరలేపాయి. ఇప్పటికే భారత్ తో సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న బంగ్లాదేశ్ ను కూడా కలుపుకుని సార్క్ స్ధానంలో కొత్త కూటమి ఏర్పాటుకు అడుగులేస్తున్నాయి.

ఈ కొత్త కూటమిలో భారత్ తో పాటు దక్షిణాసియా దేశాలను సైతం ఆహ్వానించబోతున్నారు. ఈ నెలలో చైనాలోని కున్మింగ్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రతినిధులు చైనా ఆధ్వర్యంలో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ఈ కొత్త కూటమిపై మూడు దేశాలూ చర్చించినట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఈ కున్మింగ్‌లో జరిగిన సమావేశం ముఖ్య ఉద్దేశం సార్క్ లోని ఇతర దక్షిణాసియా దేశాలను కొత్త కూటమిలో చేరమని ఆహ్వానించడమే అని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో చైనా-పాకిస్తాన్-అఫ్ఘానిస్తాన్ మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను విస్తరించడం, తాలిబాన్ పాలిత ఇస్లామిక్ ఎమిరేట్‌లో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. అయితే ఈ కొత్త కూటమిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో దీనిపై స్పందించిన బంగ్లాదేశ్.. భారత్ కు వ్యతిరేకంగా తామ్ు ఎలాంటి కూటమి ఏర్పాటు చేయడం లేదని ప్రకటించింది.












Click it and Unblock the Notifications