కొత్త ఏడాదిలో భారీ విషాదం..! పేలుళ్లతో దద్దరిల్లిన బార్..!

ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న వేళ ఓవైపు సంబరాలు మిన్నంటుతుండగా.. మరోవైపు విషాద, అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో స్విట్లరాండ్ లోని ఓ రిసార్ట్ లోని బార్ లో అనూహ్యంగా పేలుళ్లు సంభవించాయి. దీంతో కొత్త సంవత్సరం వేడుకలకు గుమికూడిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. కళ్లు మూసి తెరిచేలాగా పేలుళ్ల ధాటికి పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు.

స్విట్జర్లాండ్‌లోని ఓ లగ్జరీ బార్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన పేలుడులో భారీ అగ్నిప్రమాదం జరిగి అనేక మంది చనిపోయారు. స్విట్జర్లాండ్ లోని క్రాన్స్-మోంటానాలో ఉన్న స్కీ రిసార్ట్ పట్టణంలోని లె కాన్స్టెలేషన్ బార్ మరియు లాంజ్‌లో జరిగిన పేలుడులో 40 మందికిపైగా చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా గుర్తించలేదు. అయితే అసాధారణ కరువు కాలంలో స్విట్జర్లాండ్ అడవుల్లో మంటలతో పోరాడుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Several killed as blast rips through Switzerland bar on New Year s eve

అయితే కొత్త ఏడాది వేడుకల్లో కచేరీ సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని స్విస్ మీడియా చెబుతోంది. అయితే కారణం ఇంకా తెలియలేదని స్విస్ పోలీసులు చెబుతున్నారు.బార్ లో ప్రధాన వేదికను మంటలు చుట్టుముట్టడానికి ముందే భారీ పేలుడు శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ప్రజలు భద్రత కోసం పరుగులు తీశారు. ఘటనా స్థలంలో అత్యవసర సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అంబులెన్స్‌లు వీధుల్లో బారులు తీరగా.. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడానికి ఎయిర్-గ్లేసియర్స్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. సమాచారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కుటుంబాల కోసం పోలీసులు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+