Video: పానీ.. పానీ.. పానీ.. గుక్కపెట్టి ఏడుస్తున్న పాకిస్థాన్ ప్రధాని..!

కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో సింధు జలాల ఒప్పందం అంశాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లేవనెత్తారు. సింధు జలాల నిలిపివేతపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది జలాలను పాకిస్థాన్ కు జీవనాధారంగా అభివర్ణించారు. నీటిని రాజకీయ లబ్ధి కోసం ఎన్నడూ ఆయుధంగా ఉపయోగించకూడదని అన్నారు. " సింధు జలాలు మా ప్రాంతంలో జీవనాధారం. లక్షలాది మందిని సింధు జలాలు బతికిస్తున్నాయి. మా భూమిని తడుపుతున్నాయి. భావి తరాల కోసం ఇప్పుడున్న వనరులను సంరక్షిస్తున్నాయి" అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా మన దేశానికి చురకలు అంటించే ప్రయత్నం చేశారు.

సింధు జలాల అంతర్జాతీయ ఒప్పందాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవించాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నొక్కి చెప్పారు. ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య సింధు జలాల పంపిణీ నిలిపివేత వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో పాకిస్థాన్ కు చెందిన ముష్కరులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను ఏరివేసింది. అంతేకాక అదే సమయంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు సింధు జలాల అంశం ఒప్పంద కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. ​'రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు' అని ప్రధాని మోదీ ఆ సందర్భంలో పేర్కొన్నారు. ఇక సింధు జలాలను విడుదల చేయాలని.. ఒప్పందాన్ని పునరుద్ధరించాలని పదేపదే పాకిస్థాన్ డిమాండ్లు చేస్తూ వస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్‌ లో నీటి కొరత తీవ్రంగా పెరుగుతోంది. తలసరి నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ShehbazSharif Pakistan PM stating that water should never be used as a weapon for political gain

ఇక భారత్- పాకిస్థాన్ మధ్య 1960 లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అయూబ్ ఖాన్ లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదికి తూర్పు ఉప నదులైన బియాస్, రావి, సట్లెజ్ ల నీటిపై భారత్ కు పూర్తి నియంత్రణ ఉంటుంది. అలాగే సింధు నదికి పశ్చిమ ఉప నదులైన సింధు, చీనాబ్, ఝీలం నీటిని పాకిస్థాన్ వినియోగం కోసం కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+