Sheikh Hasina: మరణశిక్ష తీర్పుపై షేక్ హసీనా రియాక్షన్ ఇదే..!
బంగ్లాదేశ్ లో గతేడాది జూన్ లో తన వ్యతిరేకులపై సామూహిక హత్యలకు పాల్పడటం సహా పలు అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ఇవాళ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ సంచలన తీర్పు ప్రకటించింది. దీనిపై బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ నేతలు, శ్రేణులు నిరసనలకు దిగుతున్నాయి. అదే సమయంలో భారత్ లో తలదాచుకుంటున్న షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్ లో అల్లర్లను రెచ్చగొట్టి, తన వ్యతిరేకుల హత్యలకు కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్ పారిపోయి వచ్చేసిన షేక్ హసీనా ఇవాళ తనకు మరణశిక్ష పడుతుందని ముందే ఊహించారు. ఏం జరిగినా దైవంపై భారం వేస్తున్నట్లు ఆ్మె కోర్టు తీర్పుకు ముందే చెప్పేశారు. అయితే కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మాత్రం ఇండియా టుడేతో స్పందిస్తూ.. ఇది పక్షపాతంతో కూడిన తీర్పు అని, రాజకీయ ప్రేరేపితమని, ప్రజాస్వామ్య మద్దతు లేని మోసపూరిత ట్రిబ్యునల్ ఇచ్చిందిగా అభివర్ణించారు.

గతేడాది ప్రధాని పదవి నుంచి తొలగించాక భారత్ లో ప్రవాస జీవితం గడుపుతున్న షేక్ హసీనా.. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తనను బంగ్లాదేశ్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగించే లక్ష్యంతో ప్రతీకారపూరిత విచారణ నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. తద్వారా తాను ఈ తీర్పును అంగీకరించడం లేదని తేల్చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం హసీనాపై చట్టపరంగా ముందుకెళ్తామని చెబుతోంది. మరోవైపు హసీనాకు మరణశిక్ష విధించిన కొన్ని నిమిషాల తర్వాత ఆమె పార్టీ అవామీ లీగ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో హసీనాకు మరణశిక్ష విధించాలన్న పిలుపు "తాత్కాలిక ప్రభుత్వంలోని తీవ్రవాద వ్యక్తుల యొక్క ధైర్యమైన, హత్యాకాండ ఉద్దేశ్యాన్ని వెల్లడిస్తుందని పేర్కొంది.

షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు దోషిగా నిర్ధారించారు. గత సంవత్సరం ఆమె ప్రభుత్వం పతనానికి దారితీసిన విద్యార్థుల తిరుగుబాటు సమయంలో అనేక మందిని చంపడం కూడా ఇందులో ఉంది. ఆమె లేకుండానే నెలల తరబడి విచారణ జరిగింది. చివరికి ట్రైబ్యునల్ ఆమెను మూడు ఆరోపణలపై దోషిగా నిర్ధారించింది. ఇందులో హింసను ప్రేరేపించడం, నిరసనకారులను చంపడానికి ఆదేశాలు జారీ చేయడం, విద్యార్థుల నిరసన సమయంలో దారుణాలను నిరోధించడంలో విఫలమవడం ఉన్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications