Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ కు షాక్... ట్రంప్ గో బ్యాక్ అమెరికన్ల మెరుపు నిరసన

యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో అమెరికన్లలో సైతం ఆందోళన నెలకొంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ తో పాటు, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లకు చేటు చేసేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హ్యాండ్స్ ఆఫ్ పేరుతో ప్రజల ఆందోళనలు
ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ హాండ్స్ ఆఫ్ పేరుతో ఆందోళనకు దిగారు. ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో జరుగుతున్న అతిపెద్ద ఆందోళన ఇది అని చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయ వర్గాలలో కూడా ప్రస్తుతం ట్రంప్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ముందుచూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా వాణిజ్యయుద్ధాలు జరిగే అవకాశం ఉందని ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

shock for donald trump nationwide handsoff protests by americans against trump administration

ట్రంప్ గో బ్యాక్ అంటూ నిరసనలు
నార్త్ కరోలినా, మసాచుసెట్స్, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్ చికాగో మయామి వంటి నగరాలలో పలుచోట్ల నేడు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయం పైన కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 12 వందలకు పైగా ప్రదేశాలలో హాండ్స్ ఆఫ్ పేరుతో నిరసన ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ట్రంప్ గో బ్యాక్ అంటూ నినదిస్తున్నారు.

స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు
హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ, మస్క్ వజ్ నాట్ ఎలెక్టెడ్ వంటి నినాదాలతో స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశంలో అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, టారిఫ్ ల విధింపు, మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యత వంటి అంశాలపైన ప్రజలు తమ ఆందోళనలను కేంద్రీకరించారు.

ట్రంప్ పాలనపై అఅమెరికన్ల అసంతృప్తి
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పై పడుతున్న ప్రభావం, మానవహక్కుల అంశాలపైన ట్రంప్ మరియు మస్క్ తీరు పైన తీవ్ర అసహనంతో ఉన్నారు. అమెరికన్లు కోరుకున్నట్టుగా ట్రంప్ పాలన లేదని ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+