షాకింగ్ : అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్!
భారతీయులకు షాకిచ్చే వార్త చెప్పింది యునైటెడ్ స్టేట్స్. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్పోస్టుల వద్ద 30 మంది భారతీయులను అరెస్టు చేసినట్టు పేర్కొంది. కాలిఫోర్నియాలోని ఇమిగ్రేషన్ చెక్పోస్టుల వద్ద 49 మంది అక్రమ వలసదారులను బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. ఇందులో 30 మంది భారతీయులు ఉన్నారని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది.
అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్న యూఎస్ బోర్డర్ పోలీసులు
ఇందులో అక్రమంగా నివసిస్తున్న కొందరితో పాటు, కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్సులు లేకుండా సెమి ట్రక్కులు నడుపుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది.నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 12 మధ్య చేపట్టిన ఆపరేషన్ లో బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్నారు.

యూఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఇండియన్స్
ఇంటర్ స్టేట్ హైవేలు, ఇమిగ్రేషన్ చెక్పోస్టుల వద్ద వీరిని అరెస్టు చేశారు. వీరిలో 30 మంది భారతీయులు ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన వారు రష్యా ,మెక్సికో, చైనా, తుర్కియే తదితర దేశాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇటీవల అమెరికాలో జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు మరణించడంతో ట్రంప్ సర్కార్ ఆపరేషన్ హైవే సెంటినల్ పేరుతో వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ నిర్వహించారు.
కాలిఫోర్నియాలో ఉన్న ట్రక్కింగ్ కంపెనీల లక్ష్యం
ట్రంప్ సర్కార్ విదేశీ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు, వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ ల జారీని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కుల పైన అధికారులు దృష్టిసారించి చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఇప్పటివరకు అరెస్టు అయిన 42 మందితో పాటు, మరో ఏడుగురు అక్రమ వలసదారులను పట్టుకున్నారు.
49కి చేరిన అరెస్టుల సంఖ్య
దీంతో అరెస్టుల సంఖ్య 49కి చేరుకుంది. వలస చట్టాల ఉల్లంఘనలను నివారించడం, దేశంలోని హైవేలను రక్షించడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఏదేమైనా యూఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో పలువురు భారతీయులు ఉండడం ఆందోళన కలిగిస్తుంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications