విమానం కూలితే సెల్ఫీలు, పోలీసులపై వేటుకు రంగం

యువతతో పాటు అందరికీ సెల్ఫీల పిచ్చి పెరుగుతోంది. విషాధ సమయాల్లోను సెల్ఫీలు తీసుకుంటూ గడపడం బాధాకరం. ఇటీవల ఒకరు... తన బామ్మ చనిపోవడంతో, ఆమె పక్కన సెల్ఫీ దిగారు. ఇది సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది.

తాజాగా, ప్రమాదం సమయంలోను సెల్ఫీల మోజులో పడిన ఇద్దరు పోలీసుల పైన వేటు పడనుంది. ఈ సంఘటన బ్రిటన్లో జరిగింది.

బ్రిటీష్ పోలీసు విభాగంలో కొత్తగా చేరిన ఇద్దరు పోలీసు అధికారులు లండన్‌లోని ఓ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాల్సి ఉంది. అక్కడికి కొద్ది దూరంలో ఓ విమానం కుప్పకూలింది.

Shoreham air crash officers filmed selfies

వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాల్సిన సదరు యువ పోలీసు అధికారులు.. బాధ్యతను మరిచిపోయారు. ఆ ప్రమాద సంఘటన బ్యాక్ మైదానంలో నిలబడి సెల్పీలు దిగారు. అనంతరం ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా సహోద్యోగులకు ఫార్వర్డ్ చేశారు. దీంతో ఈ విషయం బయటపడింది.

ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. 16 మంది గాయాలపాలయ్యారు. దీంతో బాధితుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పిన పోలీసు శాఖ దీనిపై దర్యాప్తు చేపట్టింది. వారి పైన వేటుకు సిద్ధమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+