వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ టీకాతో రక్తం గడ్డకట్టదు -8దేశాల్లో నిలిపివేత నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై WHO క్లారిటీ

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారిపై పోరులో ప్రధాన ఆయుధంగా భావిస్తోన్న వ్యాక్సిన్ పై పెద్ద స్థాయిలో అనుమానాలు తలెత్తడం, ఏకంగా ఎనిమిది దేశాలు ప్రధాన టీకా వాడకాన్ని నిలిపేసిన నేపథ్యం కలకలం పుట్టిస్తున్నది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పంపిణీని యూరప్‌లో కొన్ని దేశాలు తాత్కాలికంగా నిలిపి వేస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ స్పందించింది.

ఆయా దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను నిలిపివేయడానికి ఎటువంటి సహేతుక కారణాలు లేవని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. వాక్సిన్‌ తీసుకున్న వారి రక్తంలో సమస్యలు ఏర్పడడానికి వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని నిపుణుల కమిటీ తేల్చిందని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టంచేసింది.

షాక్: ఆ టీకాతో రక్తం గడ్డకడుతోంది -ఎనిమిది దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ నిలిపివేత, కలకలంషాక్: ఆ టీకాతో రక్తం గడ్డకడుతోంది -ఎనిమిది దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ నిలిపివేత, కలకలం

should-use-astrazeneca-covid-19-vaccine-who-as-many-nations-suspend-rollout

'వ్యాక్సినేషన్‌ కారణంగా మరణాలు సంభవించాయని చెప్పే ఎలాంటి రుజువులు ఇప్పటివరకు లభించలేదు. వ్యాక్సిన్‌ల పంపిణీ సమయంలో ఎలాంటి భద్రతా సమస్యలు ఎదురైనా, వాటిని తప్పకుండా సమీక్షించుకోవాలి. ప్రస్తుతం ఆ వ్యాక్సిన్‌ను ఉపయోగించ వద్దనడానికి ఎలాంటి రుజువులు లేవు. అందుకే ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని కొనసాగించాలి' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హ్యారిస్‌ స్పష్టంచేశారు.

కొన్ని దేశాల్లో సంభవించిన మరణాల సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. ఇతర వ్యాక్సిన్‌ల మాదిరిగానే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కూడా అద్భుతంగా పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొంతమంది రక్తంలో సమస్యలు ఎదురవుతున్నట్లు డెన్మార్క్‌, నార్వే, ఐస్‌లాండ్‌, ఇటలీ, రోమానియా వంటి దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాయి. నిజానికి..

తిరుపతి ఉప ఎన్నిక: బరిలో బీజేపీ -అధికారిక ప్రకటన -పవన్ చెవిలో మళ్లీ కమలం పువ్వుతిరుపతి ఉప ఎన్నిక: బరిలో బీజేపీ -అధికారిక ప్రకటన -పవన్ చెవిలో మళ్లీ కమలం పువ్వు

should-use-astrazeneca-covid-19-vaccine-who-as-many-nations-suspend-rollout

ఆస్ట్రియాలో ఆస్ట్రాజెనెకా టీకా తీసుకొన్న ఓ నర్సుకు కొన్ని రోజుల్లోనే ఆమె రక్తంలో సమస్యలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఆమె కన్నుమూసింది. దీంతో ఈ టీకా వినియోగాన్ని ఆస్ట్రియాలో నిలిపేసింది. ఇక డెన్మార్క్‌లోనూ ఓ ఫిర్యాదు రావడంతో రెండు వారాలపాటు ఆస్ట్రాజెనెకా టీకా వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే దారిలో నార్వే, ఎస్తోనియా, లత్వియా, లుత్వేనియా, లక్సంబర్గ్‌ దేశాలు కూడా టీకాల్లోని ఓ బ్యాచ్‌కి చెందిన వాటిని వాడటం ఆపేశాయి. ఇలా వరుసగా యూరప్‌ దేశాలు తాత్కాలికంగా టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమని మరోసారి ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే..

రైల్వేలో రూ.లక్ష కోట్లు ప్రైవేటు చేతికి -ఆస్తుల అమ్మకంలో మోదీ సర్కార్ జోరు -శాఖలవారీగా టార్గెట్లు ఇవేరైల్వేలో రూ.లక్ష కోట్లు ప్రైవేటు చేతికి -ఆస్తుల అమ్మకంలో మోదీ సర్కార్ జోరు -శాఖలవారీగా టార్గెట్లు ఇవే

యూరోప్‌ దేశాల్లో ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని నిలిపేయడంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అదే ఆస్ట్రాజెనెకా సంస్థ భారత్ లో సీరం ఇనిస్టిట్యూట్ తో కలిసి దాదాపు యూరప్ ఫార్ములాతోనే 'కొవిషీల్డ్' రూపొందించడం, దాన్ని ఇండియాలో విరివిగా వాడుతుండటాన్ని గుర్తుచేస్తూ.. ''మన కేంద్ర ప్రభత్వానికి ఈ విషయంపై దృష్టి సారించిందా?'' అని స్వామి ప్రశ్నించారు.

English summary
The World Health Organization said Friday there was no reason to stop using AstraZeneca's Covid-19 vaccine after several countries suspended the rollout over blood clot fears. The WHO, which said its vaccines advisory committee was examining the safety data coming in, stressed that no causal link had been established between the vaccine and clotting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X