చాన్స్ ఇస్తే భారత్ లో కల్లోలం సృష్టిస్తాం: మసూద్
ఇస్లామాబాద్: కాశ్మీర్ ను ఆధీనంలోకి తీసుకోవడంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైయ్యిందని, నిర్ణయాత్మక లోపాలే అందుకు కారణం అని జైష్ ఇ మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాకిస్థాన్ ప్రభుత్వం మీద మండిపడ్డాడు.
ఒక్క అవకాశం మాకు ఇస్తే భారత్ లో అల్లకల్లోలం సృష్టిస్తామని మసూద్ అజహర్ పాక్ ప్రభుత్వాన్ని కోరాడు. జైష్ వార పత్రిక అల్ ఖ్వాలమ్ తాజా సంచికలో మసూద్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
పాక్ ప్రభుత్వం కొద్దిపాటి ధైర్యం చూపితే అంటూ మసూద్ అజహర్ అల్ ఖ్వాలమ్ పత్రిక మొదటి పేజీలో వ్యాసం రాశాడు. ప్రభుత్వ నిర్లక్షంతో జీహాదీలను కోల్పోయే పరిస్థి ఇక ఎదురు కాకూడదని మసూద్ అజహర్ ప్రకటించాడు.

జీహాదీ విధానాలు దేశానికి వ్యూహాత్మక ప్రయోజనాలు చేకూరుస్తాయని పాకిస్థాన్ ప్రభుత్వానికి నేరుగా సూచించాడు. పాక్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించాడు.
భారతదేశానికి వ్యతిరేకంగా తమ కార్యకలాపాలు అమలు చెయ్యడానికి అనుమతించాలని పాక్ కు మనవి చేశాడు. ముజాహిదీన్ కు ఒక్క అవకాశం ఇస్తే భారత్ పని పడతామని, వారు కోలుకోలేని దెబ్బ కొడతామని చెప్పాడు.
కాశ్మీర్ సమస్య, నీటి వివాదం తదితర అంశాలు పూర్తి స్థాయిలో ఒకే సారి పరిష్కరించుకునే అవకాశం ఉందని మసూద్ అజహర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 1971 నాటి చేదు జ్ఞాపకాలను తుడిచిపెడుతూ, 2016లో విజయవంతమైన భావోద్వేగాలను మనసునిండా నింపుకోవచ్చని పాక్ ప్రభుత్వానికి సూచించాడు.
భారతదేశం అఖండ భారత్ నిర్మాణానికి ప్రయత్నిస్తుందని, అందులో భాగంగా జీహాదీలను అణచివేస్తుందని ఆరోపించాడు. భారత ఆశలను కూకటి వేళ్లతో తుంచేందుకు మాకు అవకాశం ఇవ్వాలని, అందుకు జీహాదీ విధానం ఎంతగానో సహకరిస్తుందని పాక్ కు సలహా ఇచ్చాడు.
పఠాన్ కోట్, ఊరీ దాడులతో భారత్ తన సైనిక పరాక్రమాన్ని గుర్తు చేసిందని చెప్పాడు. పాక్ మీద మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ ప్రయత్నిస్తున్నదని, అందుకు కాశ్మీర్ పరిస్థితి చూస్తే అర్థం అవుతుందని మసూద్ అజహర్ చెప్పాడు. అయితే మసూద్ అజహర్ విషయంపై పాక్ ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications