Storm Eunice : భీకర గాలులు-రాకాసి అలలు-లండన్ లో తుపాన్ దృశ్యాల కనువిందు
లండన్ లో యూనిస్ తుపాను కల్లోలం రేపుతోంది. ఓవైపు భీకర గాలులతో పాటు మరోవైపు రాకాసి అలలు కూడా లండన్ నగరాన్ని కుదిపేస్తున్నాయి. దీంతో ఈ దృశ్యాల్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. అదే సమయంలో ఇలాంటి గాలుల వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తుల నష్టం కూడా జరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ విచిత్ర వాతావరణంతో విమానాల ల్యాండింగ్ సైతం చూపరుల్ని ఆకట్టుకుంటోంది.

లండన్ లో యూనిస్ తుపాను
లండన్ లో యూనిస్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న మొదలైన తుపాను కల్లోలం ఇవాళ కూడా కొనసాగుతోంది. దీంతో జనం రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. భీకరమైన గాలులు వీస్తుండటంతో జనం ప్రాణాలు అరచేత్తో పట్టుకుని ఇళ్లకే పరిమితమవుతున్నారు.
అలాగే సముద్రంలో రాకాసి అలలు కూడా రాబోయే ప్రమాదానికి సూచికలుగా కనిపిస్తున్నాయి. ఈ తుపాను వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
కనువిందు చేస్తున్న దృశ్యాలు
యూనిస్ తుపాను ఉగ్రరూపం దాల్చినా మరోవైపు జనానికి మాత్రం కావాల్సినంత ఆహ్లాదాన్ని పంచుతోంది. తుపాను కారణంగా వీస్తున్న భారీ గాలులతో పాటు రాకాసి అలల్ని సైతం చూసేందుకు జనం పోటీ పడుతున్నారు. ఇదే అదనుగా కొందరు ఔత్సాహికులు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ కూడా పెట్టి ఈ దృశ్యాల్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
మరికొందరైతే దొరికిన వీడీయోల్ని దొరికినట్లు అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ కూడా పెరుగుతోంది. మరికొన్ని వీడియోలకు లైవ్ కామెంటరీలను కూడా జత చేస్తున్నారు. తాజాగా 3.3 మిలియన్ల మంది యూకే రాజధాని లండన్ లో వీస్తున్న గాలులు, విమానాల ల్యాండింగ్ వీడియోలు చూశారు.

తుపానుతో భారీ నష్టం
ఇంగ్లండ్‌లో యూనిస్ తుపాను కారణంగా లక్షా 40 వేల ఇళ్లకు, ఐర్లాండ్‌లో 80 వేల ఇళ్లకు, వ్యాపారాల సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ప్రస్తుతం లక్షలాది మంది తమ ఇళ్లలో గుమికూడి ఆశ్రయం పొందవలసి వస్తోంది. టన్ పశ్చిమ తీరానికి ఎదురుగా ఎత్తైన అలలు కూలిపోవడంతో, లండన్ లో తొలిసారి రెడ్ అలర్ట్ ఇచ్చారు.
దీంతో జనం ప్రాణాలు అరచేత్తో పట్టుకుని దాక్కుంటున్నారు. యూనిస్ తుఫాను కారణంగా పశ్చిమ ఐరోపా అంతటా విమానాలు, రైళ్లు, రీలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నెదర్లాండ్స్ , ఐర్లాండ్, బెల్జియంలో ఇప్పటివరకు నలుగురు మరణించినట్లు తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications