SpiceJet: గల్ఫ్ దేశాల్లో భారతీయులకు గుడ్ న్యూస్..!

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులతో భారతీయులకు కంటి మీద కునుకులేకుండా పోతోంది. ఇక్కడ నివసిస్తున్న కోటి మంది భారతీయుల పరిస్ధితి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు ఉన్న అవకాశాలపై వారు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎంబసీలను సంప్రదిస్తున్నప్పటికీ విమానాలు లేకుండా తిరిగి భారత్ కు వెళ్లడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ (spicejet) కీలక నిర్ణయం తీసుకుంది.

ఇరాన్ వార్ కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి వెనక్కి తెచ్చేందుకు యూఏఈకి 14 ప్రత్యేక విమానాలు పంపినట్లు ఇవాళ స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి యూఏఈ నుంచి ఈ ప్రత్యేక విమానాలు భారత్ లోని వివిధ నగరాలకు మన వాళ్లను తీసుకురాబోతున్నాయి. స్పైస్‌జెట్ 14 విమానాలలో 13 విమానాలు ఫుజైరా నుండి బయలుదేరుతాయని, ఒకటి దుబాయ్ నుండి నడుస్తుందని తెలిపింది.

SpiceJet Launches 14 Repatriation Flights from UAE for Stranded Indians

ఈ సర్వీసులలో ముంబైకి తొమ్మిది విమానాలు, ఢిల్లీకి నాలుగు విమానాలు, దుబాయ్ నుండి పూణేకు ఒక విమానం ఉన్నాయి. ఇవి గల్ఫ్ లో చిక్కుకుపోయిన ప్రయాణీకులను దశల వారీగా భారత్ కు తీసుకొచ్చేందుకు అందుబాటులో ఉంచారు. మధ్య ప్రాచ్యంలో వైమానిక స్థావరాల మూసివేత నేపథ్యంలో ప్రభావితమైన పౌరులను స్వదేశానికి రప్పించడానికి భారతదేశం చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో భాగంగా స్పైస్ జెట్ విమానయాన సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. పరిమిత సీట్లు, షెడ్యూళ్ల కారణంగా ఈ అత్యవసర మార్గాలలో విమాన ధరలు భారీగా ఉన్నాయి. ఫుజైరా నుండి ఢిల్లీకి ఛార్జీ ₹93,374గా నిర్ణయించారు. ఈ ప్రత్యేక కార్యకలాపాల కోసం చివరి నిమిషంలో సీట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు రూట్, తేదీ, బుకింగ్ సమయం, మిగిలిన ఇన్వెంటరీని బట్టి ఛార్జీలు సుమారు ₹78,000 నుంచి ₹94,000 మధ్య ఉండవచ్చని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+