" ఆ 22 భారత్ నౌకలు సేఫ్.. హార్మూజ్ వద్ద.."
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. రెండు వారాలుగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులు దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. అలాగే లెబనాన్ రాజధాని బీరుట్ పైనా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ తో పాటు అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్ గా ఇరాన్ దాడులు చేస్తోంది.
యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే భారత్ జెండాలు కలిగిన నౌకలను హార్మూజ్ జలసంధి గుండా ఇరాన్ అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ జలసంధి వద్ద ఉన్న 22 నౌకలు, 611 మంది క్రూ సిబ్బంది సేఫ్ గా ఉన్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. భారత్ లోని పోర్టుల వద్ద ఎలాంటి ఇబ్బంది లేదని.. మేరిటైమ్ రవాణా సజావుగానే సాగుతుందని తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర షిప్పింగ్ మినిస్ట్రీ అడిషనల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించారు.
గత 24 గంటల్లో దాదాపు 25 మంది భారతీయులను సైన్ ఆఫ్ ప్రక్రియ ముగిసిన అనంతరం వివిధ మార్గాల్లో స్వదేశానికి తరలించాం. 24 గంటలపాటు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశాం. గత 24 గంటలుగా 125 టెలిఫోన్ కాల్స్, 450 ఈమెయిల్స్ వచ్చాయి. అన్నింటికీ స్పందించాం.. అని సిన్హా వెల్లడించారు. ఎల్పీజీ కార్గోను వివిధ నౌకల ద్వారా డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పటికే శివాలిక్, నందాదేవి నౌకలు భారత్ కు చేరుకున్నాయి.

ఈ రెండు నౌకలు హార్మూజ్ జలసంధి నుంచి మార్చి 13 లేదా మార్చి 14 న భారత్ కు చేరుకున్నాయి. దాంతో భారత్ లో ఎల్పీజీ కొరత కాస్త తగ్గినట్లు భావించవచ్చు. దేశంలోని కోట్ల మంది ఎల్పీజీని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. భారత్ జెండాలు కలిగిన నౌకలను ఇరాన్ అనుమతించిన సంగతి తెలిసిందే. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లకు పెరిగిన నేపథ్యంలో తమ యుద్ధ నౌకలను హార్మూజ్ జలసంధి వద్దకు మోహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
-
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!! -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
అమెరికా vs ఇరాన్: మళ్లీ చర్చలకు సన్నద్దమవుతున్న దాయాదులు! -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
US- Iran War : మళ్లీ మొదలైన వార్..! హార్ముజ్ లో అమెరికా-గల్ఫ్ పై ఇరాన్..! -
Hormuz Showdown: హార్ముజ్ లోనే తాడోపేడో..! అమెరికా-ఇరాన్ లో గెలిచేదెవరు ? -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
గల్ఫ్ లో భారత్ భారీ రెస్క్యూ ఆపరేషన్ -
వామ్మో.. నిమిషాల్లోనే రూ. 8 లక్షల కోట్లు హాంఫట్..












Click it and Unblock the Notifications