ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ మప్పు?
Indonesia Earthquake: సోమవారం ఇండోనేషియా ఆగ్నేయ భాగంలోని తనింబర్ దీవులలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్స్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్(GFZ) తెలిపింది. జర్మన్ రీసెర్స్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ ప్రకారం.. భూకంప కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. యూఎస్ జియోలాజికల్ సర్వే కూడా ఈ భూకంపాన్ని నిర్ధారించింది. స్థానిస సమయం ప్రకారం.. మధ్యాహ్నం 2.49 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 11:19 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు ఎలాంటి ఎలాంటి సునామీ ముప్పు జారీ లేదని జర్మన్ రీసెర్స్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది.
ఈ సమయంలో భూమి కొన్ని సెకన్ల పాటు కదిలింది. అయితే, భూకంపంలో ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ సమాచారం లేదు. అధికారిక సమాచారం ప్రకారం, భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదు. ప్రస్తుతం భద్రతా సంస్థలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దీనికి ముందు జనవరి 2023లో తనింబర్ దీవులలో 7.6 తీవ్రతతో ఒక భారీ భూకంపం సంభవించింది. దీని తర్వాత చాలా గంటల పాటు సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. ఇది ప్రజలలో భయాందోళనలను సృష్టించింది. ఈ భూకంపం కారణంగా కనీసం 15 ఇళ్లు, రెండు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. తనింబర్ ద్వీప సమూహాలు ఇండోనేషియాలోని మాలుకు ప్రావిన్స్‌లో భాగం. ఇది పశ్చిమాన తైమూర్, తూర్పున న్యూ గినియా మధ్య అరాఫురా సముద్రంలో సుమారు 30 ద్వీపాలతో కూడి ఉంది. తనింబర్ దీవులు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్'లో భాగం. ఇది భూమిపై అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతంగా పరిగణించబడుతుంది.












Click it and Unblock the Notifications