పాన్ కేక్ లు తినే పోటీ.. మధ్యలో పొలమారింది.. ప్రాణమే పోయింది

తిండి పోటీల్లో పాల్గొని.. ప్రైజ్ గెలవాలనే ఆతృతతో మితిమీరి పాన్ కేక్ లు తిన్న ఓ యువతి అవి గొంతుకు అడ్డం పడడంతో ప్రాణాలు కోల్పోయింది.

న్యూయార్క్: ఆహారం.. మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే అనారోగ్యం, ఆ స్థాయిని కూడా దాటి ఇష్టమొచ్చినట్లు లాగించేస్తే... ప్రాణాంతకం. ఏంటీ తిండి తిని ఎవరైనా చచ్చిపోతారా..? అని ఆశ్చర్యపోకండి.

న్యూయార్క్‌లో అలాగే జరిగింది. తిండి పోటీల్లో పాల్గొని.. ప్రైజ్ గెలవాలనే ఆతృతతో మితిమీరి తిన్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. న్యూయార్క్‌లోని శాక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలో పాన్‌కేక్‌లను తినే పోటీ నిర్వహించారు.

Student dies after choking during pancake eating competition

అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరిలాగానే కైట్లిన్ నెల్సన్ అనే 20 ఏళ్ల యువతి కూడా ఈ పోటీలో పాల్గొంది. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికి కొన్ని కేకులు తిన్న ఆమె ఆ తరువాత వేగంగా కేకులు తినే ప్రయత్నం చేసింది.

ఉన్నట్లుండి కేక్ గొంతులో అడ్డం పడి పొలమారి, ఊపిరి అందలేదు. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. చివరికి ఆ యువతి మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు.

దీంతో శాక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. చనిపోయిన యువతి న్యూజెర్సీ నగరానికి చెందిన విద్యార్థి అని, ఈమె తండ్రి జేమ్స్ నెల్సన్ 9/11 దాడులలో మరణించారని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+