ఫిలిప్పీన్స్‌లో అల్ల‌క‌ల్లోలం.. గంట‌కు 195 కి.మీ వేగంతో సూప‌ర్ టైపూన్ తుఫాన్‌

ఫిలిప్పీన్స్ దేశాన్ని రాకాసి తుఫాన్ వ‌ణికిస్తోంది. గంట‌కు 195 కి.మీ వేగంతో దూసుకువ‌స్తోంది. ప్ర‌జ‌ల‌ను అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు . విమానాలు, ఓడ‌రేవుల‌ను పూర్తిగా మూసివేశారు. ఈ తుఫాన్ ప్ర‌భావం ఫిలిప్పీన్స్‌లో ప్ర‌ధానంగా 8 ప్రాంతాల‌లో ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. దీంతో ఈ ప్రాంతాల్లో అధికారులు హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

దూసుకోస్తున్న సూప‌ర్ టైపూన్ తుఫాన్

దూసుకోస్తున్న సూప‌ర్ టైపూన్ తుఫాన్

ఫిలిప్పీన్స్‌లో ని మ‌ధ్య , ద‌క్షిణ ప్రాంతాల వైపు సూప‌ర్ టైపూన్ రాయ్ అత్యంత వేగంగా దూసుకోస్తోంది. ఇది ఈ సంవ‌త్స‌రంలో దేశాన్ని తాకిన 50 వ తుఫాన్‌గా ఆదేశ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. అంతే కాకుండా అత్యంత శ‌క్తివంత‌మైన‌దిగా హెచ్చించింది. తుఫాన్ ప్ర‌భావంతో ప్రాణ , ఆస్థి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌గా ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం త‌ర‌లించింది. ప్రాణ భయంతో చాలా మంది ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌ను వ‌దిలి వెళ్లిపోయారు.

అత్యంత భ‌యంక‌ర‌మైన తుఫాను..

అత్యంత భ‌యంక‌ర‌మైన తుఫాను..

ఈ తుఫాన్ గంట‌ల‌కు 195 కి.మీ వేగంలో దూసుకోస్తోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. దీంతో ఓడ రేవుల‌ను అల‌ర్ట్ చేసింది. స‌ముద్రంలోకి నౌక‌ల‌ను తీసుకువెళ్లోద్ద‌ని హెచ్చ‌రించింది. మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్ల‌రాద‌ని సూచించింది. ఓడ‌రేవుల‌లోనే అన్ని నౌక‌ల‌ను ఉంచాల‌ని కోరింది.

తుఫాను త‌ర్వాత కూడా దేశ‌వ్యాప్తంగా బ‌ల‌మైన గాలులు , భారీవ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది. మ‌రోవైపు అమెరికా ఈ దూక‌సుకోస్తున్న రాయ్ టైపూన్‌ను సూప‌ర్ టైపూన్‌గా పేర్కొంది. ఈ సంవ‌త్స‌రంలో వ‌చ్చిన తుఫానుల‌లో కెళ్లా ఇది అత్యంత భ‌యంక‌ర‌మైన తుఫానుగా అమెరికాల నేవీ జాయింట్ టైపూన్ వార్నింగ్ సెంట‌ర్ తెలిపింది.

ముంపు ప్రాంతాల్లో హై అల‌ర్ట్

ముంపు ప్రాంతాల్లో హై అల‌ర్ట్

ఫిలిప్పీన్స్‌లోకి ఎనిమిది ముంపు ప్రాంతాల్లో అధికారులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. తుఫాను ప్ర‌భావిత ప్రాంతాలైన విసాయా, మిండ‌నోవా ఐల్లాండ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఈ రాకాసీ తుఫాన్ కార‌ణంగా ప‌సిపిక్ మ‌హాస‌ముద్రం ప‌రిస‌ర ప్రాంతాల్లో నివ‌సిస్తున్న దాదాపు ల‌క్ష మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఈ ప్ర‌భావిత ప్రాంతాల్లో సుమారు 30 మిలియ‌న్ల‌ మంది నివ‌సిస్తున్నారు. అలాగే విమానాల‌ను ర‌ద్దు చేశారు. అన్ని పోర్టుల‌ను తాత్కాలికంగా మూసివేశారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+