పాలస్తీనాకు మద్దతుగా రంగంలోకి సిరియా,లెబనాన్ ? ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు..!

ఇజ్రాయెల్ ను భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో టార్గెట్ చేస్తూ పాలస్తీనా తీవ్రవాద సంస్ధ హమాస్ ప్రారంభించిన పోరు మరో మలుపు తిరుగుతోంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా పశ్చిమదేశాలు రంగంలోకి దిగుతుండగా.. ఇజ్రాయెల్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అరబ్ దేశాలు ఏకమవుతున్నాయి. హమాస్ దాడుల్ని తిప్పికొడుతున్న ఇజ్రాయెల్ 3 వేలకు పైగా పాలస్తీనా పౌరుల్ని పొట్టనబెట్టుకుంది. అదే సమయంలో గాజాను తిరిగి కైవసం చేసుకున్నట్లు ప్రకటించింది.

గాజా స్ట్రిప్‌లో పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాద సంస్ధ ప్రారంభించిన భీకర దాడి నేపథ్యంలో ఓవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లో పోరాటం కొనసాగుతుండగా... దీనికి కౌంటర్ గా ఉత్తర ఇజ్రాయెల్ లోని సైనిక షెల్లింగ్ పోస్ట్‌లను టార్గెట్ చేస్తూ లెబనాన్, సిరియా క్షిపణులు ప్రయోగించడం మొదలుపెట్టాయి. పశ్చిమ గలిలీ వద్ద లెబనాన్ నుండి 15 రాకెట్లు ప్రయోగించారని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో అనేక పట్టణాలలో సైరన్‌లను ఏర్పాటు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా నాలుగు క్షిపణుల్ని అడ్డగించగా, మిగిలినవి బహిరంగ ప్రదేశాల్లో పడ్డాయని దీంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది.

syria and lebanon entered into israel-palestine war, begins exchange of fire, UAE warns assad

లెబనాన్, సిరియా నుంచి మొదలైన రాకెట్ దాడికి ప్రతిస్పందనగా ఫిరంగి దాడులను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తొలుత ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత హిజ్బుల్లా తీవ్రవాద సంస్ధకు చెందిన రెండు పోస్టులను తమ ట్యాంకులు షెల్ చేశాయని ప్రకటించింది. కొద్దిసేపటి తర్వాత ఉత్తర ఇజ్రాయెల్ పట్టణమైన అవివిమ్ సమీపంలోని సాయుధ వాహనం వద్ద లెబనాన్ నుండి యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని ప్రయోగించారని ఐడీఎఫ్ వెల్లడించింది. ఇందులోనూ సైనికులు ఎవరూ గాయపడలేదు. దీనికి కౌంటర్ గా ఓ యుద్ధ హెలికాప్టర్ మూడవ హిజ్బుల్లా పోస్ట్‌ను ఢీకొట్టిందని సైన్యం తెలిపింది.

మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ పోరులోకి దూరొద్దని యూఏఈ సిరియాలోని అసద్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అబుదాబిని కూడా దాని భూభాగం నుండి ఇజ్రాయెల్‌పై ఎటువంటి దాడులను అనుమతించవద్దని కోరింది. హిజ్బుల్లా, ఇతర పార్టీలు ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో చేరకుండా నిరోధించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే యూఏఈ ఈ దౌత్యం నెరుపుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+