ఒకప్పుడు ఆప్ఘాన్ ఐటీ మంత్రి.. ఇప్పుడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్‌గా మారిపోయారు!

కాబూల్/బెర్లిన్: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకపాలన అనుభవంలో ఇప్పటికే విదేశాలకు పారిపోయిన ప్రజాప్రతినిధులు అతి సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా, ఓ ఆఫ్ఘాన్ మంత్రి జీవితం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఆప్ఘానిస్థాన్ ఐటీ మంత్రిగా చేసిన సయ్యద్ అహ్మద్ షా సాదత్ ఇప్పుడు.. జర్మనీ దేశంలో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సయ్యద్ అహ్మద్ షా సాదత్ 2018 వరకు ఆఫ్ఘనిస్థాన్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. తాలిబన్ల అజెండాకి భయపడటంతోపాటు ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో విభేదాలు తలెత్తడంతో ఆ పదవికి రాజీనామా చేసి జర్మనీకి వెళ్లిపోయారు సయ్యద్ అహ్మద్ షా సాదత్. చాలా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏ ఉద్యోగమూ రాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

Taliban effect: Once Afghanistan minister, Syed Ahmad Shah Saadat now works as pizza delivery Boy in Germany.

ఈ నేపథ్యంలో ఏదో ఒక పనిచేసి కుటుంబాన్ని పోషించులానుకున్నారు. చేసేదేం లేక పిజ్జా డెలివరీ బాయ్ పనిని ఎంచుకున్నారు. అయితే, ప్రస్తుతం తాను, తన కుటుంబం జర్మనీలో సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు సయ్యద్. తాను జర్మనీలోని లీప్ జి్గ్‌లో తన కుటుంబంతో సంతోషంగా, సురక్షితంగా ఉన్నానని తెలిపారు. సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

పిజ్జా అమ్మకాలు చేయగా వచ్చిన డబ్బును ఏ మాత్రం వృథా చేయడంలేదు. దాచుకుంటున్నా. ఇక్కడే జర్మనీ కోర్స్ చేస్తూ చదువుకోవాలనుకుంటున్నా. ఇక ఇతర ఉద్యోగాలకూ అప్లై చేస్తున్నా. దేనికీ స్పందన రాలేదు. నా కోరిక మాత్రం ఒక్కటే. ఎలాగైనా టెలికాం పనిచేయాలని. అవసరమైన విద్యను నేర్చుకుంటున్నా అని సయ్యద్ అహ్మద్ షా సాదత్ తెలిపారు.

కాగా, సయ్యద్ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు కమ్యూనికేషన్ డిగ్రీ పొందారు. అంతేగాక, 13 దేశాల్లో కమ్యూనికేషన్ విభాగంలో 23 ఏళ్లపాటు పనిచేసిన అనుభవం ఉంది. తన సొంత దేశంలో ఐటీ మంత్రిగా కూడా పనిచేశారు. ఇన్ని అర్హతలు కలిగిన సయ్యద్ ఇప్పుడు పిజ్జా డెలివరీ గాయ్ పనిచేయడం చూస్తే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయనే సమేత గుర్తుకు వస్తోంది.

మరోవైపు ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. తాజాగా హోలీ,మెక్‌కే అనే మహిళా జర్నలిస్ట్ తాలిబన్ల దురాగతాలు,ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి బయటి ప్రపంచానికి తెలియజేశారు. డల్లాస్ మార్నింగ్ న్యూస్‌లో ఆమె రాసిన కథనం ద్వారాఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ తాలిబన్ల గురించి ఆమె చెప్పారంటే... 'గత వారం ఆఫ్గనిస్తాన్ దురాక్రమణ పూర్తయ్యాక... తాలిబన్లు ఇంటింటికి వెళ్లి మహిళలు,15 ఏళ్లు పైబడిన బాలికల కోసం వెతుకుతున్నారు.వారిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారు' అని మెక్‌ కే తెలిపారు. తాను ఆఫ్గనిస్తాన్‌ను వదిలి వచ్చినప్పటికీ... అక్కడున్న తన స్నేహితుల గురించి తలుచుకుంటే బాధగా ఉందన్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు చెప్పారు. ఒకప్పుడు ఆఫ్గన్ గడ్డపై మహిళా హక్కుల కోసం తామెంతలా పోరాడమో గుర్తుచేసుకుంటున్నట్లు తెలిపారు.

ఆఫ్గనిస్తాన్ నుంచి పారిపోయే క్రమంలో కాబూల్‌లో ఓ 14 ఏళ్ల బాలికతో తాను మాట్లాడానని మెక్ కే తెలిపారు. ఆ బాలిక తనకు చదువుకోవాలని ఉందని... భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటున్నానని చెప్పిందన్నారు. కుందుజ్‌కి చెందిన ఆ బాలిక ప్రస్తుత పరిస్థితుల కారణంగా కుటుంబంతో కలిసి దేశం వీడుతోందన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో మహిళా హక్కుల కోసం పనిచేస్తూ... వారిపై అణచివేతను బయటి ప్రపంచానికి తెలియజేసిన ఫరీహా ఈసర్... ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులకు హృదయం ముక్కలయ్యేలా రోధిస్తోందన్నారు. 'నన్ను ఆఫ్గన్ నుంచి త్వరగా వచ్చేయాలని బయటి దేశాల్లోని మిత్రులు కోరారు. కానీ ఎలా వచ్చేది... ఇక్కడ నా అక్కాచెల్లెళ్లు ఇంత బాధను అనుభవిస్తుంటే... నేను మాత్రం ఎలా దేశం దాటిపోయేది..' అని ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+