తాలిబన్ల సర్కార్ ప్రమాణ స్వీకారం రద్దు-చివరి నిమిషంలో షాకింగ్-అసలు కారణాలివే ?

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు కోసం పలు దేశాలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇవాళ వారి నుంచి సంచలన ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఇందుకు పలు కారణాలను కూడా వారు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు రష్యా, ఇరాన్, పాకిస్తాన్, చైనా వంటి దేశాల్ని ఆహ్వానించిన నేపథ్యంలో తాలిబన్లు తీసుకున్న చివరి నిమిషం నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.

 తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం రద్దు

తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం రద్దు

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారం లాక్కున్న తాలిబన్లు రేపో మాపో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అంతా భావిస్తున్న తరుణంలో ఇవాళ షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం రద్దయినట్లు ఇవాళ తాలిబన్ల నుంచి ఓ ప్రకటన వెలువడింది. అమెరికాపై 9/11 దాడులు జరిగిన రోజైన ఇవాళ తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని, దీన్ని చివరి నిమిషం వరకూ రహస్యంగా ఉంచుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇవాళ్టి వరకూ అందరినీ ఊరించిన తాలిబన్లు కీలక నిర్ణయం ప్రకటించేశారు.

 చివరి నిమిషంలో బ్రేక్ వెనుక ?

చివరి నిమిషంలో బ్రేక్ వెనుక ?

తాలిబన్లు అమెరికాపై అల్ ఖైదా దాడులు జరిపిన 9/11 ఘటనకు ఇవాళ్టితో 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా చివరి నిమిషం వరకూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రహస్యంగానే ఉంచిన తాలిబన్లు.. వేడుకలు వద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు వారు పలు కారణాలను తెలిపారు. ఇందులో ప్రధానంగా ఆప్ఘనిస్తాన్ ప్రస్తుతం వనరులు, నిధుల లోటుతో సతమతం అవుతోంది. అందుకే మరింత వనరులు, డబ్బు వృథా చేయకూడదనే ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్లు వెల్లడించారు.

యూఎస్, నాటో దేశాల ఒత్తిడి

యూఎస్, నాటో దేశాల ఒత్తిడి

అమెరికా బలగాలు వైదొలిగిన తర్వాత ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటులోపే అక్కడి పరిస్ధితులను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో యుఎస్, దాని నాటో మిత్రదేశాలు తాలిబన్ల మిత్రదేశమైన ఖతార్ ప్రభుత్వంపై "అమానవీయంగా" ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించకుండా తాలిబాన్లకు సలహా ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఇప్పుడు భారీ ఎత్తున ప్రభుత్వ ప్రమాణ కార్యక్రమం నిర్వహిస్తే పాశ్చాత్య దేశాలకు ఇది కంటగింపుగా మారే ప్రమాదం ఉందని వారిని ఖతార్ హెచ్చరించినట్లు తెలుస్తోంది అందుకే వారు వేడుకలు రద్దు చేసుకున్నట్లు చెప్తున్నారు.

తాలిబన్లకు హ్యాండిచ్చిన చైనా, రష్యా ?

తాలిబన్లకు హ్యాండిచ్చిన చైనా, రష్యా ?


మరోవైపు ఇప్పటివరకూ తాలిబన్లకు మిత్రదేశాలుగా భావిస్తున్న రష్యా, చైనా చివరి నిమిషంలో వారికి హ్యాండిచ్చాయన్న ప్రచారం కూడా సాగుతోంది. తమ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి తాలిబన్లు చైనా, రష్యా, పాకి్స్తాన్, ఖతార్, ఇరాన్ వంటి దేశాల్ని ఆహ్వానించారు. ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి వీరు వెళితే అమెరికాతో పాటు నాటో దేశాల్ని మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని రష్యా, చైనా వంటి దేశాలు భావించినట్లు తెలుస్తోంది. ఇది అంతిమంగా మరో పోరుకు దారితీస్తుందని భయపడినట్లు సమాచారం. అందుకే రష్యా ఇప్పటికే ఈ కార్యక్రమానికి రాలేమని తేల్చిచెప్పేసింది. ఇవాళ చైనా కూడా రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే చైనా, రష్యా లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తే తమ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకనే విషయంలో సమస్యలు తప్పవని తాలిబన్లు భావించినట్లు సమాచారం. అందుకే ఈ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+