నేనుండగా దాడులా ? ఉగ్రవాదులు పారిపోవాల్సిందే .. శ్రీలంకలో పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్‌టైన్ చేసిన కేఏ పాల్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు. వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయిన శ్రీలంకలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ పర్యటిస్తున్నారు.

శ్రీలంక బాంబు దాడుల్లో గాయపడ్డ వారిని పరామర్శించిన కేఏ పాల్ .. రాజపక్సేతో భేటీ

శ్రీలంక బాంబు దాడుల్లో గాయపడ్డ వారిని పరామర్శించిన కేఏ పాల్ .. రాజపక్సేతో భేటీ

ఈస్టర్ పండుగ సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలైన బాధితులను పరామర్శించేందుకు కేఏ పాల్ శ్రీలంకకు పయనమై వెళ్ళారు కేఏ పాల్ . ప్రపంచ శాంతి దూతగా అనేకమంది దేశాధ్యక్షులతో పర్సనల్ రిలేషన్ షిప్ కొనసాగించే కేఏ పాల్...శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్రా రాజపక్సెతో భేటి అయ్యారు. మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసిన భేటీలో రాజపక్సేతో టీ తాగుతూ కేఏ పాల్ పరిస్థితిని సమీక్షించారు. అంతేకాదు బాంబుపేలుళ్లలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో అందరూ ప్రార్ధనలు చెయ్యాలని పిలుపునిచ్చిన పాల్

సోషల్ మీడియాలో అందరూ ప్రార్ధనలు చెయ్యాలని పిలుపునిచ్చిన పాల్

ప్రపంచ దేశాల్లో శాంతిని నింపే కేఏ పాల్ చాలా ఆలస్యంగా శ్రీలంకకు వెళ్ళారు .కొలంబోలో వరుస ఉగ్రదాదులు జరుగుతుంటే నాకేం తెలియదు అన్నట్లుగా ఇన్నాళ్ళు మాట్లాడని పాల్ ఒక్కసారిగా శ్రీలంక వెళ్ళారు . అక్కడికి వెళ్ళిన ఆయన "ప్రస్తుతం తాను శ్రీలంకలో ఉన్నాను.. బాంబు పేలుళ్లలో ఇక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.. మరి కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. వారి ప్రాణాల కోసం అందరూ ప్రార్ధన చేయండి" అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు పాల్.

 నేనుండగా దాడులు ఎలా చేస్తారు ? ఉగ్రవాదులు దేశం వదిలి పారిపోవాల్సిందేనన్న పాల్

నేనుండగా దాడులు ఎలా చేస్తారు ? ఉగ్రవాదులు దేశం వదిలి పారిపోవాల్సిందేనన్న పాల్

నేను దైవ దూతని.. దేవుడు నేను ఒకటే నేను ప్రార్థన చేశాను.. ఉగ్రవాదులు దేశం విడిచి పారిపోవాల్సిందే.. ఏమనుకుంటున్నారు ? నేనుండగా ఎలా దాడులు చేశారు.. రేపు వెళ్ళి ట్రంప్ ని కలిసి ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదాన్ని రూపుమాపుతాను అని హామీ ఇచ్చారు పాల్ .శ్రీలంక మృతుల కుటుంబాల కోసం ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా అప్పీల్ చేశారు. అదే సందర్భంలో ఉగ్రవాదాన్ని అణిచివేసి ప్రపంచంలో శాంతి నెలకొనేలా చేసేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని, అందుకోసం తాను చొరవ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కేఏ పాల్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+