Robotaxi-RoboVan: మతిపోగొడుతున్న టెస్లా రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్ లు-ఫీచర్లు ఇవే.. !

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో ముందున్న టెస్లా సంస్థ మరో రెండు కొత్త వాహనాల్ని ప్రపంచానికి పరిచయం చేసింది. తాజాగా తయారైన రెండు అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ రోబో మోడల్ వాహనాలను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. సంస్థ నిర్వహించిన "వీ రోబోట్" కార్యక్రమంలో అట్టహాసంగా విడుదల చేశారు. అల్ట్రా మోడల్ డిజైన్లతో పాటు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కూడా ఎంతో ఆకట్టుకునేలా వీటిని రూపొందించారు.

టెస్లా రూపొందించిన సైబర్ క్యాబ్ లోనే వేదిక వద్దకు వచ్చిన ఎలాన్ మస్క్.. ఆ తర్వాత రెండు వాహనాలను ఆవిష్కరించారు. సైబర్ క్యాబ్ గా చెప్తున్న రోబోట్యాక్సీ తయారీ 2026లో ప్రారంభం అవుతుందని మస్క్ ప్రకటించారు. అలాగే దీని ధర 30 వేల అమెరికన్ డాలర్లలోపే ఉంటుందన్నారు. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 25.2 లక్షలు. ఈ కారుకు ఎలాంటి స్టీరింగ్ కానీ, పెడల్స్ కానీ ఉండవు.

Tesla unveils self-driving robovan and robotaxi vehicles- here are ultimate features


ప్రజా రవాణా ఖర్చు కంటే ఇందులో ప్రయాణానికే తక్కువ ఖర్చవుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. అలాగే టెక్సాస్, కాలిఫోర్నియాలో వచ్చే ఏడాది నాటికి టెస్లా మోడల్ 3, మోడల్ Yలో స్టార్టర్స్ కోసం అందుబాటులో ఉంటాయన్నారు. మోడల్ S, సైబర్‌ట్రక్ కూడా పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఆప్టిమైజ్ చేయబడిన సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2026లో ప్రారంభం అవుతుందన్నారు. మరోవైపు 20 మంది ప్రయాణించేందుకు వీలుగా రోబోవ్యాన్ ను కూడా టెస్లా ఆవిష్కరించింది.


మినీ బస్ లా ఉండే ఈ రోబో వ్యాన్ కు కూడా డ్రైవర్ అవసరం లేదు. దీని రెండు వైపులా వెనుక నాలుగేసి సీట్లు, మధ్యలో మూడేసి సీట్లు ఇచ్చారు. అలాగే లోకల్ ట్రైన్ తరహాలో మరికొంత మంది నిలబడేందుకు సైతం వీలుంది. రద్దీగా ఉండే రోడ్లపై సైతం ప్రయాణించేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు. ఎలక్ట్రిక్ వాహనం కావడంతో ఎలాంటి శబ్దకాలుష్యం, వాయు కాలుష్యం కూడా లేకుండా ప్రయాణిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+