వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈతకు వెళుతున్నారా జాగ్రత్త: నీటిలో ప్రాణాలు తీసే అమీబా తిష్టవేసుకుని ఉంది

|
Google Oneindia TeluguNews

టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ పదేళ్ల బాలికి తన ప్రాణాలకోసం పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. లిల్లీ మే అవంత్ అనే ఈ చిన్నారి బ్రజోస్ నది ఆతర్వాత లేక్ విట్‌నేలో ఈతకు వెళ్లింది. ఆ తర్వాత ఆ చిన్నారి అనారోగ్యంకు గురైంది. లిల్లీని వెంటనే చికిత్స కోసం ఫోర్ట్‌వర్త్‌లోని కుక్ చిల్డ్రన్స్‌ హెల్త్‌కేర్ సిస్టంకు సెప్టెంబరు 8న తరలించారు. అయితే వెన్నులో ఓ భాగం నయేగ్లేరియా ఫోలేరీ అనే అమీబా చేరిందని వైద్యులు గుర్తించారు. ఈ అమీబా ఎక్కువగా తాగునీటి సరస్సులు, నదుల్లో ఉంటుందని వైద్యులు తెలిపారు.

 బ్రెయిన్ ఈటర్ అమీబాతో మృతి చెందిన చిన్నారి

బ్రెయిన్ ఈటర్ అమీబాతో మృతి చెందిన చిన్నారి

ఎప్పుడూ చదువులో ముందుండే చిన్నారి లిల్లీ మే అవంత్ తమను వీడి వెళ్లడం చాలా బాధాకరమని లిల్లీ చదివిన స్కూలు యాజమాన్యం ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అందరితో చాలా సఖ్యతగా ఉండేదని స్కూలు యాజమాన్యం కొనియాడింది. తమ బిడ్డ మృతిని జీర్ణించుకోలేకున్నామని చిన్నవయస్సులోనే భగవంతుడు తనను తీసుకెళ్లాడంటూ కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఇదిలా ఉంటే లిల్లీ ఎలా మృతి చెందిందో అనేదానిపై వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ యాజమాన్యం నిరాకరించింది.

నాసిక రంధ్రాల నుంచి శరీరంలోకి ప్రవేశించే అమీబా

నాసిక రంధ్రాల నుంచి శరీరంలోకి ప్రవేశించే అమీబా

నయేగ్లేరియా ఫోలేరీ అనే ఈ అమీబా నాసిక రంధ్రాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడు వరకు పాకుతుందని వైద్య నిఫుణులు చెబుతున్నారు. మెదడులో టిష్యూను ధ్వంసం చేస్తుందని వారు చెప్పారు. 2009 నుంచి 2018లో ఈ అమీబా బారిన పడిన వారి సంఖ్య 34గా ఉన్నిందని చెప్పారు. 1962 నుంచి 2018వరకు ఈ తరహా అమీబా బారన పడిన వారు కేవలం నలుగురు మాత్రమే బతికినట్లు వైద్యులు చెబుతున్నారు.

తొమ్మిది రోజుల్లో బయటపడే లక్షణాలు

తొమ్మిది రోజుల్లో బయటపడే లక్షణాలు

ఇక ఈ అమీబా బారిన పడినప్పుడు తొలి రోజు నుంచి 9 రోజుల సమయంలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. ముందుగా జ్వరంతో పాటు తలనొప్పి తీవ్రంగా ఉండటం, నాసియా, వాంతులు లాంటి లక్షణాలు బయటపడుతాయని వైద్యులు వివరించారు. మెడ పట్టేసుకుపోవడం, మూర్ఛపోవడం, హాలుసినేషన్ మరియు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారి లిల్లీ ప్రాణాల కోసం దాదాపు రెండువారాలుగా పోరాడిందని చెప్పారు.

English summary
A 10-year-old Texas girl has died after she contracted a brain-eating amoeba, her family said.Lily Mae Avant "has gone to be with Jesus," her aunt, Loni Yadon, said in a statement Monday morning."She fought the good fight and built an ARMY of prayer warriors around the world doing it," Yadon wrote in a Facebook post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X