అయ్యో.. 34 మందిని కాల్చేశాడు.. మృతుల్లో 22 మంది చిన్నారులు
థాయ్ లాండ్ లో దారుణం చోటుచేసుకుంది. దక్షిణ థాయిలాండ్ సోంగ్ ఖ్లాలోని డే కేర్ సెంటర్ లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 23మంది చిన్నారులు సహా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 34 మందిని హతమార్చి అనంతరం తాను కూడా కాల్చుకుని నిందితుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
థాయిలాండ్ లో అత్యంత ఘోరమైన సామూహిక కాల్పుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 22 మంది చిన్నారులున్నారు. దక్షిణ థాయిలాండ్‌లోని సోంగ్‌ఖ్లా పాఠశాలలో సాయుధుడు కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులను బందీలుగా పట్టుకున్నాడని మీడియా, ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపాయి.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సాయుధ పోలీసులు చేరుకున్నారు. వందలాది మంది యువకులు పాఠశాల బయటకి పారిపోగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకా భవనం లోపలే చిక్కుకుపోయారు.
దుండగుడి నుంచి తప్పించుకున్న సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ, సాయుధుడు పాఠశాల హెడ్‌మాస్టర్‌ను కాల్చి చంపాడని తెలిపాడు. "నాకు బుల్లెట్ తగిలింది, కానీ నేను తప్పించుకున్నాను. పాఠశాల డైరెక్టర్ ను కాల్చివేశారు. ఇంకా చాలా మంది పిల్లలు లోపల బందీలుగా ఉన్నారు" అని ఆయన వివరించాడు.

పోలీసుల ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తికి 18 ఏళ్లు అని తెలుస్తోంది. థుంగ్ లుంగ్ జిల్లాలో అతను ఇంటి వద్ద అస్తవ్యస్తంగా ప్రవర్తిస్తూ, తల్లిని బెదిరించినట్లు పోలీసులు నివేదించారు. పాఠశాలకు సమీపంలోనే అతని ఇల్లు ఉన్నట్లు సమాచారం.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications