అమెరికన్లను వరించిన నోబెల్ ప్రైజ్: ఆర్థికశాస్త్రంలో వినూత్న ప్రయోగం: నూతన ఆక్షన్ సిద్ధాంతం
ఓస్లో: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల పరంపరలో మరో అంకం ముగిసింది. కీలకమైన ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించింది కమిటీ. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థికశాస్త్రంలో వినూత్న ప్రయోగాలు చేసిన ఇద్దరికి ఈ అవార్డులను ప్రకటించింది. పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్‌లకు ఈ ఏడాది ఆర్థికశాస్త్రం నోబెల్ పురస్కారాలను అందజేయనున్నట్లు వెల్లడించింది.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 12, 2020
The 2020 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded to Paul R. Milgrom and Robert B. Wilson “for improvements to auction theory and inventions of new auction formats.”#NobelPrize pic.twitter.com/tBAblj1xf8
ఇంప్రూవ్‌మెంట్స్ ఇన్ ఆక్షన్ థియరీ అండ్ ఇన్నోవేషన్స్ ఆఫ్ న్యూ ఆక్షన్ ఫార్మట్స్‌ను రూపొందించిన పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్‌కు ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతులను అందించనున్నట్లు కమిటీ పేర్కొంది. పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్.. ఇద్దరూ అమెరికాలోని స్టాన్‌ఫొర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. 1948లో అమెరికాలోని డెట్రాయిట్‌కు చెందిన మిల్గ్రోమ్ 1979లో స్టాన్‌ఫొర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

అనంతరం.. అదే యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతిగా ఉన్నారు. రాబర్ట్ బీ విల్సన్ 1937లో జెనీవాలో జన్మించారు. 1963లో హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పట్టా అందుకున్నారు. మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థికశాస్త్రంలో వారు కనుగొన్న నూతన ఆక్షన్ సిద్ధాంతాలు కొనుగోలుదారుడికి, వినియోగదారుడికి, పన్నుదారులకు లబ్ది పొందేలా ఉన్నాయని నోబెల్ బహుమతుల కమిటీ, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ గొరాన్ హన్‌సన్ తెలిపారు.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 12, 2020
The 2020 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded to Paul R. Milgrom and Robert B. Wilson “for improvements to auction theory and inventions of new auction formats.”#NobelPrize pic.twitter.com/tBAblj1xf8
ఆర్థికశాస్త్రంలో ఇదొక వినూత్న ప్రయోగానికి దారి తీస్తుందని అన్నారు. అందుకే ఈ విభాగంలో వారికి ఈ అవార్డుల పేర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. గత ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీకి లభించిన విషయం తెలిసిందే. ఇదివరకు భారత్‌కే చెందిన ఆమర్త్యసేన్‌కు ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ సారి ఈ విభాగంలో ఇద్దరు అమెరికన్ ప్రొఫెసర్లకే ఈ అవార్డు వరించింది.
Robert Wilson – awarded this year’s Prize in Economic Sciences – showed why rational bidders tend to place bids below their own best estimate of the common value: they are worried about the winner’s curse – that is, about paying too much and losing out.#NobelPrize pic.twitter.com/3pJpVuc1e5
— The Nobel Prize (@NobelPrize) October 12, 2020
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications