మలాలాపై దాడి: 10 మందికి 25 ఏళ్ల జైలు శిక్ష
ఇస్లామాబాద్: ఆడపిల్లలు చదువుకోవాలని ప్రచారం చేస్తున్నదని 15 సంవత్సరాల బాలిక మీద హత్యాయత్నం చేసిన తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇలాంటి నేరాలు చేసేవారికి ఇదే సరైన శిక్ష అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
నోబుల్ శాంతిబహుతి అందుకున్న మలాలా యూసఫ్ జాయ్ మీద దాడి చేసిన 10 మంది తాలిబన్ ఉగ్రవాదులు గురువారం జైలు శిక్షకు గురైనారు. మలాలాకు 15 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో పాకిస్థాన్ లో ఆడపిల్లలు చదువుకోవాలని ప్రచారం చేసింది.

విషయం తెలుసుకున్న తాలిబన్ ఉగ్రవాదులు 2012లో స్కూల్ కు వెళుతున్న మలాలాపై కాల్పులు జరిపారు. అయితే మలాలా మృత్యువుతో పోరాడి ప్రాణాలు నిలబెట్టుకుంది. మలాలాతో పాటు పాకిస్థాన్ లోని షాజియా రంజాన్, కైనత్ రియాజ్ అనే ముగ్గురు అమ్మాయిల మీద తాలిబన్ ఉగ్రవాదులు దాడులు చేశారు.
2014 సెప్టెంబర్ లో 10 మంది తాలిబన్ ఉగ్రవాదులను పాకిస్థాన్ సైన్యం అరెస్టు చేసి జైలుకు పంపించారు. పాకిస్థాన్ లోని ఆంటి టెర్రరిజం కోర్టు కేసు విచారణ పూర్తి చేసి 10 మంది నిందితులకు గురువారం 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
మలాలాపై దాడి జరగడానికి పాకిస్థాన్ లోని తెహరిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ కమాండర్ ముల్లా ఫజాలుల్లా హస్తం ఉందని శిక్షకు గురైన ఉగ్రవాదులు అంగీకరించారని డీజీ అసీం బజ్వా తెలిపారు. ఉగ్రవాదులపై పోరాటం చేసిన మలాలాకు గత సంవత్సరం నోబుల్ శాంతి బహుమతి అందించారు.












Click it and Unblock the Notifications