Boeing 737: విమానం కాక్‌పిట్ విండోలో పగుళ్లు.. అత్యవసర ల్యాండింగ్..

కాక్‌పిట్ విండోలో పగుళ్లు రావడంతో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన జపాన్ లో జరిగింది. జపాన్‌కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్‌కు చెందిన దేశీయ విమానం శనివారం బయలుదేరిన కొద్ది క్షణాల తర్వాత సపోరో-న్యూ చిటోస్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. బోయింగ్ 737-800 ఎయిర్‌క్రాఫ్ట్ మిడ్‌ఎయిర్ కాక్‌పిట్ విండోలో పగుళ్లు కనిపించాయని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు.

ఫ్లైట్ 1182 టొయామా విమానాశ్రయానికి వెళుతుండగా కాక్పిట్ లో పగుళ్లు గమనించారు. కాక్‌పిట్ చుట్టూ ఉన్న నాలుగు కిటికీల వెలుపలి భాగంలో పగుళ్లు కనిపించాయని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. పగుళ్లు కనిపించినప్పుడు విమానంలో 59 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. "ఈ పగుళ్లు విమాన నియంత్రణ లేదా ఒత్తిడిని ప్రభావితం చేసే విషయం కాదు" అని ఓ వార్త ప్రతినిధి చెప్పారు.

The plane made an emergency landing after the cockpit window cracked

అంతకు ముందు అలస్కా ఎయిర్ లైన్స్ చెందిన విమానం గాల్లో ఉండగా డోర్ ఊడిపోయింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తిరగనీయకుండా చేసింది. వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. భారత్ లోని బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలు ఉన్నాయి. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిని ఆకాశ ఎయిర్‌ (22), స్పైస్‌ జెట్‌ (9), ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (9) ఉన్నాయి.

జనవరి 2న మంగళవారం జపాన్ కోస్ట్ గార్డ్ జెట్‌ను ఢీకొనడంతో టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో రన్‌వేపై ప్రయాణీకుల విమానం మంటలు చెలరేగింది. ఢీకొన్న తర్వాత జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో 12 మంది సిబ్బందితో సహా మొత్తం 379 మంది ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+