పోలండ్ పై క్షిపణి దాడి చిచ్చు- మూడో ప్రపంచ యుద్ధ భయాలు ? నాటో రియాక్ట్ అయితే..
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరునెలలుగా సాగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు సాయం చేస్తున్న పాశ్చాత్య దేశాల ధోరణి పుతిన్ కు రుచించడం లేదు. దీంతో అణుయుద్ధం చేస్తామంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా పంపారు. ఇప్పుడు నాటో సభ్యదేశమైన పోలండ్ లో తాజాగా ఓ క్షిపణి పడింది. అది ఉక్రెయిన్ వైపు నుంచే దూసుకొచ్చింది. ఇది ముందు రష్యా క్షిపణి అని భావించినా చివరికి ఉక్రెయిన్ దేనని నిర్దారణ అయింది.
తమ సభ్యదేశం పోలండ్ పై క్షిపణి దాడి జరిగిన నేపథ్యంలో తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు నాటో కూటమి సమావేశమవుతోంది. ఈ క్షిపణి దాడికి రష్యాను బాధ్యురాలిని చేయాలని నాటో భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రష్యాపై దాడికి నాటో దేశాలు సిద్ధమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అప్పుడు ఇది అంతిమంగా మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందనే భయాలు మొదలయ్యాయి. క్షిపణి దాడి ఘటన తర్వాత నాటో కూటమిలో ఉన్న దేశాల నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో జరిగిన ప్రపంచ యుద్ధాలకు కూడా దాదాపు ఇలాంటి చిన్న కారణాలే కారణమయ్యాయి. వాటిని ఆయాదేశాలు సీరియస్ గా తీసుకోవడంతో యుద్ధాలు చినికి చినికి గాలివానగా మారిపోయాయి. ఇప్పుడు అదే తరహాలో పోలండ్ పై క్షిపణి దాడి ఘటన మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి 8నెలలు కావస్తుండటం, ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడం, నాటో, ఐరాస సహా పలు అంతర్జాతీయ సంస్ధలు ఆంక్షలు విధిస్తున్నా రష్యా వెనక్కితగ్గకపోవడంతో నాటో దేశాలు దాడికి మొగ్గు చూపవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications