ఐఎస్ఐఎస్ ‘శక్తి రహస్యం’ అమ్ఫెటామైన్ (ఫోటోలు)
న్యూయార్క్/సిరియా: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు శక్తివంతులుగా ఎలా ఉంటారో వెలుగు చూసింది. ఇస్లామిక్ స్టేట్ లో చేరిన వారిని తిరిగి బయటకు వెళ్లకుండా చూడటానికి ఉగ్రవాదులు శక్తివంతమైన డ్రగ్స్ ఇస్తూ వారిని లోంగదీసుకుంటున్నారు.
ఖలీఫా సామ్రాజ్య స్థాపన (ఇస్లాం రాజ్య స్థాపన) పేరుతో ఇస్లామిక్ స్టేట్ నడిపిస్తున్నది మతం కాదని, మత్తు అని ఇటివల ప్రపంచం గుర్తించింది. ఇరాన్, సిరియాలోని పలు స్వచ్చంద సంస్థలు జరిపిన రహస్య కార్యచరణలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
ఇస్లామిక్ స్టేట్ కు మొదటి శక్తి అమ్ఫెటామైన్ (డ్రగ్స్) అనే ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ చూడటానికి చాల చిన్నవిగా ఉంటాయి. అయితే ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగించిన తరువాత 48 గంటల పాటు ఎలాంటి బౌతిక ప్రభావాలు ఉండవని లెబనీస్ సైకియాట్రిస్టులు అంటున్నారు.

48 గంటలు హీరోలే
ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగించిన తరువాత 48 గంటల పాటు ఫైటర్స్ శక్తి పేరిగిపోయి యుద్దంలోకి దిగుతున్నారని, ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియదని డ్రగ్స్ నిర్మూలణాధికారులు అంటున్నారు.

ఏమి లెక్క చెయ్యరు
ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్న తరువాత కండరాలకు బలాన్నిస్తుంది. చలి, ఎండ, వానల ప్రభావం చూపదు. అంతే కాకుండ ఎంత పెద్ద గాయాలైనా నొప్పి మాత్రం ఉండదని చెబుతున్నారు.

ఉష్ణోగ్రత 12 డిగ్రీల నుంచి 0 డిగ్రీలు
అక్టోబర్ నెల తరువాత సిరియా, ఇరాక్ దేశాల్లో ఉష్ణోగ్రత 12 డిగ్రీల నుంచి 0 డిగ్రీల వరకు పడిపోతుంది. అంతటి చలిలో అమ్ఫెటామైన ట్యాబ్లెట్స్ ఉపయోగించి ఎలాంటి ఇబ్బంది లేకుండా యుద్దం చేసే శక్తిని ఇస్తుంది.

మొదట్లో మెడిసన్
మొదట్లో ఈ అమ్ఫెటామైన్ ట్యాబ్లెట్స్ మానసిక వ్యాధుల నిరోధానికి, ఉబకాయంకు ఉపయోగించేవారు.

డ్రగ్స్ అని వెలుగు చూసింది
1980 సంవత్సరం తర్వాత ఈ ట్యాబ్లెట్స్ డ్రగ్స్ అని వెలుగు చూడటంతో పశ్చిమ దేశాల్లో నిషేధానికి గురైయ్యింది.

కోటి ట్యాబ్లెట్స్ సీజ్
2014లో సిరియా నుంచి లిబెనాన్ కు రహస్యంగా ఎగుమతి అవుతున్న 1,05 కోట్ల ట్యాబ్లెట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

48 గంటల పాటు హింసించినా ఫలితం శూన్యం
ఉగ్రవాదులు ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగించిన తరువాత అధికారులకు పట్టుబడితే ఎన్ని దెబ్బలు కొట్టినా నవ్వుతూనే ఉంటారని, అందుకే వారిని 48 గంటల పాటు గదిలో వదిలేసి తరువాత విచారిస్తామని మాదకద్రవ్యాల నియంత్రణాధికారులు అంటున్నారు.

55 శాతం సిరియా నుంచి ఎగుమతి
ఇప్పటి వరకు వివిద దేశాలలో డ్రగ్స్ నియంత్రణాధికారులు స్వాధీనం చేసుకున్న అమ్ఫెటామైన్ ట్యాబ్లెట్స్ సిరియా లో తయారు అయ్యాయని అధికారులు తెలిపారు.

యువతకు వీటితో వల
ఒక్క సారి ఈ డ్రగ్స్ కు అలవాటు పడిన వారు వాటిని విడిచి పెట్టడం చాల కష్టం. అందుకే ఇస్లామిక్ స్టేట్ లో చేరిన వారికి మొదట ఉగ్రవాదులు ఈ డ్రగ్స్ ఇచ్చి అలవాటు చేస్తున్నారు.

చాల సులభంగా తయారు చేస్తున్నారు
రసాయనిక శాస్త్రంపై కొద్దిపాటి అవగాహన ఉంటే లెవో, డెక్స్రో ధాతువుల్ని ఎంత శాతం కలపాలో తెలుసుకుంటే అమ్ఫెటామైన్ ట్యాబ్లెట్స్ తయారు చెయ్యవచ్చని, ఖర్చు చాల తక్కువే అని లెబనీస్ సైకియాట్రిస్ట్స్ అంటున్నారు.












Click it and Unblock the Notifications