సూపర్ డాగ్: తన యజమానిని వీల్‌ఛైర్‌లో ఊరుమొత్తం తిప్పేస్తోంది
ఫిలిప్పీన్స్ : పెంపుడు జంతువుల్లో విశ్వాసమైనది ఏది అని అడిగితే మన నుంచి వెంటనే వచ్చే సమాధానం కుక్క. అవునండీ నిజంగానే శునకానికి ఉన్నంత విశ్వాసం మరే పెంపుడు జంతువుకు ఉండదు. ఇక్కడ కూడా అదే జరిగింది. డేనియల్ అలార్కాన్ అనే వ్యక్తికి కొన్నేళ్ల కిందట రోడుప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన వెన్ను పూర్తిగా దెబ్బతినడంతో వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు. అయితే తనకు అండగా నేనున్నానంటూ తన పెంపుడు కుక్క డిగాంగ్ ముందుకొచ్చింది.
వీల్‌చైర్‌లో డేనియల్ ఎక్కడికి వెళ్లాలన్నా డిగాంగ్ అనే ఈ కుక్కనే తీసుకెళుతుంది. తన తల ముక్కుతో వీల్‌చైర్‌ను తోస్తుంది. ఈ కుక్క వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం ఏడు నెలల చిన్న కుక్కపిల్ల డిగాంగ్. పుట్టినప్పటి నుంచి డేనియల్‌తోనే ఉండటంతో తన యజమాని పట్ల ఎనలేని విశ్వాసం ఆ శునకం చూపిస్తుంది. అలా ఫిలీప్పీన్స్ వీధుల్లో ఈ శునకం తన యజమానిని వీల్‌ఛైర్ పై తీసుకెళ్లడాన్ని చూసిన అక్కడి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

వెంటనే ఆ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో ఆ వీడియోను పొందుపర్చడంతో అదికాస్త వైరల్‌గా మారింది. కుక్కలు యజమానులను తీసుకెళ్లడం కేవలం టీవీ షోలలోనే జరుగుతాయని అనుకున్నాం గానీ... ఇలా నిజంగానే రోడ్లపై చూస్తామని అనుకోలేదని అక్కడి వారు అంటున్నారు. కొందరైతే డేనియల్‌ను ఆ కుక్కతో కలిసి సెల్ఫీలు తీసుకోవడమే కాదు... వారిని బయట రెస్టారెంట్లకు తీసుకెళ్లి డేనియల్‌తో కలిసి భోజనం చేస్తున్నారు. వావ్ ఇది నిజంగా సూపరే కదా..!
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications