అమెరికాలో కాల్పులు: ముగ్గురి మృతి, ఏడుగురికి గాయాలు
వాషింగ్టన్: అమెరిలో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు ఆందోళనకు కారణమవుతున్నాయి. తాజాగా, న్యూఆర్లిన్స్ నగరంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు సాయుధులు ప్రజలపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పురుషులతోపాటు ఒక మహిళ మృతి చెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

కాల్పులుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగులను గుర్తించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications