చమురు నిల్వల్లో రారాజులు.. ప్రపంచం లోనే టాప్ 10 దేశాల జాబితా ఇదే !!

అమెరికా–వెనిజులా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అరెస్టు చేయడం తీవ్ర చర్చకు తెర లేపుతుంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో అంతా చమురు గురించే అంటూ స్పష్టంగా చెప్పడం ప్రపంచ దృష్టిని చమురు నిల్వలపైకి మళ్లించింది. దీంతో ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కాగా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల జాబితాలో వెనిజులా తర్వాత సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, రష్యా, లిబియా, అమెరికా, నైజీరియా వంటి దేశాలు ఉన్నాయి. చైనా, బ్రెజిల్ వంటి దేశాలు కూడా గణనీయమైన నిల్వలు కలిగి ఉన్నప్పటికీ, టాప్ రిజర్వ్ హోల్డర్లతో పోలిస్తే వాటి వాటా తక్కువగానే ఉంటుంది. భారత్ విషయానికి వస్తే 2025 నాటికి ప్రపంచ స్థాయిలో సుమారు 24వ స్థానంలో ఉంది.

top-10-countries-list-of-oil-reserves-across-the-world

టాప్ 10 దేశాలు..

తాజా అంచనాల ప్రకారం (బిలియన్ బ్యారెళ్లలో):

వెనిజులా - 303

సౌదీ అరేబియా - 267

ఇరాన్ - 208

కెనడా - 163

ఇరాక్ - 145

యూఏఈ - 113

కువైట్ - 101.5

రష్యా - 80

యునైటెడ్ స్టేట్స్ - 74.4

లిబియా - 48.4

ఈ సంఖ్యలు OPEC, EIA, BP స్టాటిస్టికల్ రివ్యూ వంటి విశ్వసనీయ సంస్థల 2025-2026 డేటాపై ఆధారపడి ఉన్నాయి. అయితే వెనిజులా ఈ అపార సంపదను దేశం పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతోంది. దానికి కారణాలు అనేకం అని చెబుతున్నారు. ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలు.. చమురు రంగంలో సాంకేతిక లోటు, న్యూయార్క్ కోర్టుల్లో అధ్యక్షుడు నికోలాస్ మాదురోకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఈ అంశాలన్నీ కలిసి వెనిజులా చమురు ఉత్పత్తిని అడ్డుకుంటున్నాయి.

గ్లోబల్ ఆయిల్ సరఫరాపై ఆంక్షల ప్రభావం..

రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఇరాన్, రష్యా, వెనిజులా వంటి దేశాలపై విధించిన ఆంక్షల కారణంగా 2026 నాటికి ప్రపంచ చమురు సరఫరా అంచనాలు తగ్గే అవకాశం ఉంది. చమురుపై అధికంగా ఆధారపడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత సున్నితంగా ఉందో ఇది మరోసారి స్పష్టం చేస్తోంది. అయితే, ఈ పరిస్థితిలో అమెరికా మాత్రం పూర్తిగా భిన్నమైన దారిలో ప్రయాణిస్తోంది.

అమెరికా వద్ద వెనిజులా, సౌదీ అరేబియాతో పోలిస్తే చమురు నిల్వలు తక్కువే. అయినప్పటికీ, షేల్ ఆయిల్ టెక్నాలజీ ద్వారా రోజుకు సుమారు 13 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ ఉత్పత్తిదారుగా నిలిచింది.

OPEC దేశాల ఆధిపత్యం..

ప్రపంచంలోని మొత్తం 1.7 ట్రిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వల్లో 60 శాతం కంటే ఎక్కువ OPEC దేశాలవే. అందులో సౌదీ అరేబియా – 267 బిలియన్ బ్యారెళ్లు, ఇరాన్ – 208 బిలియన్ బ్యారెళ్లు, ఇరాక్ – 145 బిలియన్ బ్యారెళ్లు కలిగి ఉన్నాయి. ఈ దేశాలు ఆంక్షలు, రాజకీయ అస్థిరత ఉన్నప్పటికీ, ప్రపంచ చమురు ప్రవాహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

వెనిజులా సంక్షోభం: భవిష్యత్ మార్కెట్లపై ప్రభావం..

నిపుణుల అంచనాల ప్రకారం, వెనిజులాలో రాజకీయ, ఆర్థిక గందరగోళం ఇంకా కొనసాగవచ్చు. దీని ప్రభావంగా.. చమురు మార్కెట్లు మధ్యప్రాచ్య స్థిరత్వంపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. అలానే ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా) ఉత్పత్తి వైపు మళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే సమయంలో, ఇంధన వనరుల వైవిధ్యీకరణ (Renewables) పై ప్రపంచం మరింత దృష్టి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+