NRI NEWS: ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది భారతీయులు మృతి
సౌదీ అరేబియాలోని జాజన్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలోని భారత విదేశాంగ కార్యాలయం సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే ప్రమాదం ఎలా జరిగింది? మృతులు ఏ ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
" జాజన్ ప్రావిన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందడం బాధాకరంగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవాళ్లువెంటనే కోరుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. క్షతగాత్రుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశాం." అని భారత కాన్సులేట్ పేర్కొంది.

ఇక రోడ్డు ప్రమాదం ఘటన తెలిసిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇదే ఘటనపై జెడ్డాలోని భారత రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తమ వంతు సాయం ఉంటుందని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications