Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త రూల్ తీసుకొచ్చిన ట్రంప్.. ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఫొటోలు !!

అమెరికాలో వలసలను కట్టడి చేయాలనే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికా దేశంలోకి ప్రవేశించే లేదా అక్కడి నుంచి బయలుదేరే అమెరికాయేతర పౌరులందరి ఫోటోలు తీసి, బయోమెట్రిక్ డేటాను సేకరించనున్నట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్య, దేశ భద్రతను బలోపేతం చేయడంలో భాగమని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది.

ఫోటోలు తప్పనిసరి..

ఫెడరల్ రిజిస్టర్‌లో ఇటీవల ప్రచురించిన నియమాల ప్రకారం, యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఏజెన్సీ ఈ ప్రక్రియను అమలు చేయనుంది. దేశంలోకి ప్రవేశించే లేదా బయలుదేరే ప్రతి వ్యక్తి ఫోటో తీయబడుతుంది. ఇది గ్రీన్‌కార్డు హోల్డర్లు, వలసదారులు, టూరిస్ట్ వీసాదారులు, వర్క్ వీసా ఉన్నవారందరికీ వర్తిస్తుంది. ఈ కొత్త నియమం డిసెంబర్ 26, 2025 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది.

trump-administration-implements-new-immigration-photo-rules

అక్రమ వలసలకు అడ్డుకట్ట..

CBP అధికారులు ఈ ఫోటో ఆధారిత డేటా సేకరణ నకిలీ ప్రయాణ పత్రాలు, తప్పుడు గుర్తింపులు, వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉన్నవారి గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు పాస్‌పోర్టు స్కానింగ్ మాత్రమే ఉండగా, ఇకపై ముఖ గుర్తింపు సాంకేతికతతో (Face Recognition Technology) వలసదారులను ట్రాక్ చేయనున్నారు.

ఈ కొత్త విధానంలో అమెరికా ప్రభుత్వం అత్యాధునిక AI ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్ ఉపయోగించనుంది. ఇది డేటాబేస్‌లోని ఫోటోలను రియల్‌టైమ్‌లో సరిపోల్చి వ్యక్తుల గుర్తింపును నిర్ధారిస్తుంది. ఇలా చేయడం ద్వారా ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే వారిని వెంటనే గుర్తించడం సాధ్యమవుతుంది.

kకాగా గతంలో కూడా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో వలసల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకున్నారు. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)’ నినాదంతో దేశీయ ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యతనిచ్చిన ఆయన.. H-1B వీసా వంటి వర్క్ పర్మిట్‌లపై కఠిన నిబంధనలు అమలు చేశారు. అయితే అదే సమయంలో అమెరికన్ టాలెంట్‌కి అవకాశాలు పెంచడమే తన లక్ష్యమని ట్రంప్ చెప్పుకొచ్చారు.

H-1B వీసా ఫీజుల పెంపు..

వలసల నియంత్రణలో భాగంగా, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచి సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ కంపెనీలకు పెద్ద భారమైంది గానీ అమెరికన్ పౌరులకు ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యం” అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ స్పష్టం చేశారు.తరువాత కొంత సవరణలు చేసినా, ఆ నిర్ణయం ట్రంప్ విధాన దిశను స్పష్టంగా తెలియజేసింది.

అమెరికా వలస విధానాలు ఎప్పటికప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫోటో రిజిస్ట్రేషన్ నిబంధన ఇతర దేశాలకూ ఒక మోడల్‌గా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నాలజీ ఆధారిత భద్రతా వ్యవస్థలు భవిష్యత్తులో వలసల నియంత్రణలో ప్రధాన పాత్ర పోషించనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+