ట్రంప్ మరో సంచలనం- దేశం వీడకపోతే రోజుకు వెయ్యి డాలర్ల ఫైన్..!

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. అందుకు తగ్గట్టుగానే దేశంలో నిరుద్యోగితకు కారణమవుతున్న వలసదారుల్ని తనిఖీలు, అరెస్టులతో బెంబేలెత్తిస్తున్నారు. సొంత ఖర్చుతో విదేశాలకు పంపేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా అన్ని అనుమతులతో అమెరికా వీసాలు, గ్రీన్ కార్డులు పొందిన వారిని సైతం తనిఖీలు చేస్తూ గతంలో అక్రమాలకు పాల్పడ్డారేమో గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పుడు వీటన్నింటికీ పరాకాష్టగా అమెరికా వీడకపోతే జరిమానాలు విధించేందుకు సిద్దమవుతున్నారు.

అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కార్.. ఈ ప్రక్రియను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా అక్రమ వలసదారులపై తనిఖీలను మరింత ముమ్మరం చేయబోతున్నారు. అంతే కాదు అక్రమ వలసదారులుగా ఓసారి గుర్తించి దేశ బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దేశం వీడకపోతే రోజువారీగా జరిమానాలు విధించే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు.

Trump administration to Fine Migrants 998 per Day if failed to leave after deportation order

వాషింగ్టన్ -రాయిటర్స్ వార్తా కథనాల ప్రకారం వలసదారులను దేశ బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చాక అమెరికాను విడిచి వెళ్లకపోతే రోజుకు 998 డాలర్ల వరకు జరిమానా విధించాలని, వారు చెల్లించకపోతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. 1996 నాటి చట్టం ప్రకారం ఈ జరిమానాలు విధించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని 2018లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి పదవీకాలంలో అమలు చేశారు.

ఇప్పుడు మరోసారి ట్రంప్ ఆ విధానాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. వలసదారులపై మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జరిమానాలు విధించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. జరిమానాలు చెల్లించని వలసదారుల ఆస్తిని స్వాధీనం చేసుకోవడాన్ని కూడా ట్రంప్ పరిపాలన సిద్దమవుతోందని రాయిటర్స్ తెలిపింది. అమెరికాలో వలసదారులు గతంలో చట్టవిరుద్ధంగా సీబీపీ వన్ అని పిలువబడే మొబైల్ యాప్‌ను వాడారని, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం దాన్ని సీబీపీ హోమ్‌గా రీబ్రాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Take a Poll

మరోవైపు అమెరికా నుంచి వలసల బహిష్కరణ విషయంలో గతంలో ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై దాఖలైన కేసులపై వివిధ స్థానిక కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని సుప్రీంకోర్టు ఇవాళ నిలిపేసింది. దీంతో వలసదారుల బహిష్కరణను తిరిగి ప్రారంభించడానికి ట్రంప్ సర్కార్ కు అనుమతి లభించింది. వలసల విషయంలో డొనాల్డ్ ట్రంప్ కఠినమైన విధానానికి ఇది పాక్షిక విజయమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు నిర్ణయంతో వలసదారుల బహిష్కరణకు 1798 నాటి గ్రహాంతర శత్రువుల చట్టాన్ని ఉపయోగించడాన్ని కొనసాగించడానికి కూడా అనుమతి లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+