యుద్ధం ఆగింది: ట్రంప్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ సాయంత్రం 5 గంటల నుంచి 10 రోజుల పాటు కొనసాగనుంది. అంటే భారత కాలమానం ప్రకారం సీజ్ ఫైర్ అర్ధరాత్రి 3 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ కానుంది. ఈ మేరకు తమ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాధినేతలు అంగీకారం తెలిపినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. వచ్చే 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని తెలిపారు. తాను ఇప్పటివరకూ 9 యుద్ధాలను ఆపేశానని.. ఇది పదోది కాబోతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య 34 ఏళ్లలో తొలిసారిగా చర్చలు జరిగాయని గుర్తు చేశారు.

ఇక ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అమెరికా సంధి కుదుర్చింది. 34 ఏళ్లలో తొలిసారిగా ఇరు దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ డీసీలో ప్రత్యక్షంగా సమావేశం అయ్యారు. ఇక ఇరు దేశాల మధ్య జరిగిన ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కీలక పాత్ర పోషించారు. ఇక ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య శాంతి స్థాపన కోసం ట్రంప్ ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. వారిలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అలాగే జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కైన్ కూడా ఉన్నారు.

Trump Announces 10-Day Ceasefire Agreement Between Israel and Lebanon Major Breakthrough Reached

ఇజ్రాయెల్- లెబనాన్ కాల్పుల విరమణపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మొత్తం పదవీకాలంలో ఇప్పటివరకూ 9 యుద్ధాలను ముగించానని ఇది పదో యుద్ధం అని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా గాజాలో హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈనెల 22తో ముగియనుంది. ఇక ఇరాన్- అమెరికా మధ్య రెండో దశ శాంతి ఒప్పందం జరిగేందుకు రంగం సిద్ధం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+