పాకిస్థాన్- అమెరికా వాణిజ్య చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. భారత్ కు మాత్రం..?

భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల్లో తలదూర్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టింది. అయితే భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన వల్లే జరిగిందని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతేకాక ప్రపంచ దేశాలకూ ఇదే చెప్పుకుంటూ వచ్చారు. భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం తీవ్రతరం కాకుండా ఆపగలిగానని.. లేదంటే ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరిగి ఉండేదని చెప్పుకొచ్చారు ట్రంప్.

అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వచ్చేవారం పాకిస్థాన్ కు చెందిన ప్రతినిధులు అమెరికాకు వస్తున్నారని ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరగబోతోందని అన్నారు. ఈ మేరకు అమెరికా- పాకిస్థాన్ మధ్య ట్రేడ్ టాక్స్ వచ్చే వారం ప్రారంభం అవుతాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

"వాణిజ్య చర్చల కోసం వచ్చేవారం పాకిస్థాన్ ప్రతినిధులు అమెరికాకు రానున్నారు. భారత్ తోనూ అమెరికా చర్చల కోసం సిద్ధంగా ఉంది. కానీ భారత్- పాకిస్థాన్ ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటే మాత్రం వాణిజ్య ఒప్పందం జరగదు" అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలపై టారిఫ్ లు విధించారు. ఈ మేరకు పాక్ కు 29 శాతం టారిఫ్ లు విధించారు. భారత్ పై 26 శాతం టారిఫ్ లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Trump Confirms Pakistani Diplomatic Team to Visit US for Trade Talks

ఇటీవల యాపిల్ కంపెనీ భారత్ లో పెట్టుబడులు పెట్టడం తనకు ఇష్టం లేదని ట్రంప్ మీడియా ముందే స్వయంగా తెలపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భారత్ లో అధిక టారిఫ్ లు విధిస్తారని.. అందుకు ప్రత్యామ్నాయంగా అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్.. యాపిల్ కంపెనీకి సూచించారు.

అయితే 50 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టే కంపెనీలనే భారత్ లోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇక ఆయా దేశాలపై ట్రంప్ 90 రోజుల టారిఫ్ బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో పలు దేశాలు శ్వేతసౌధంతో చర్చలు జరుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+