వామ్మో.. ట్రంప్ బిగ్ స్కెచ్: మళ్లీ ఎన్నికల బరిలో: రాజ్యాంగం ఏం చెబుతోంది..!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. 2028లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తోన్నట్లు చెప్పారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత.. తొలి ఏడాది పనితీరుపై మెజారిటీ అమెరికన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ట్రంప్ ఈ దిశగా అడుగులు వేస్తోన్నారని చెబుతున్నారు. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడొచ్చనే అంచనాలు ఉన్నాయి.

ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వేసిన ఓ పోస్ట్ ఈ చర్చకు కేంద్రబిందువు అయింది. ఇప్పటికే వరుసగా మూడుసార్లు అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేశారు ట్రంప్. తొలిసారి విజయం సాధించినప్పటికీ.. రెండో దఫా ఓడిపోయారు. మూడో ప్రయత్నంలో గెలిచారు. అన్ని చోట్లా రికార్డు సంఖ్యలో తనకు మద్దతు లభిస్తోందని, తాను నాలుగోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించాలా? అని ప్రశ్నించారు. ఈ పోస్ట్ కు భారీ సంఖ్యలో రిప్లైలు పడ్డాయి. మిశ్రమంగా స్పందించారు నెటిజన్లు.

Trump Floats 4th Term Bid as Support Surges on Truth Social

మెజారిటీ సంఖ్యలో సోషల్ మీడియా యూజర్లు పాజిటివ్ గా స్పందించారని, నాలుగో దఫా ఎన్నికల కోసం ఆయన ప్రయత్నాలు సాగించవచ్చనీ అంటున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడానికి అనుమతి లేదు. రాజ్యాంగంలోని 22వ సవరణ స్పష్టంగా ఈ నిబంధనను పేర్కొంది. ఏ వ్యక్తి కూడా రెండుసార్లకు మించి అధ్యక్ష పదవికి ఎన్నిక కాకూడదు. అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైన పదవీ కాలంలో రెండు సంవత్సరాలకు మించి అధ్యక్ష పదవిలో ఉన్నా లేదా ఆ బాధ్యతలు నిర్వర్తించినా, ఆ వ్యక్తి ఒక్కసారికి మించి అధ్యక్ష పదవికి అనర్హుడు.

రాజ్యాంగ నిబంధనలు ఇలా ఉన్నప్పటికీ- ట్రంప్, ఆయన మద్దతుదారులు మాత్రం మళ్లీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశాన్ని పదే పదే సూచిస్తున్నారు. Trump 2028 (Rewrite the Rules) అని రాసి ఉన్న టోపీలు, టీ-షర్టులను విక్రయించడం అప్పుడే ప్రారంభించారు కూడా. ఇదే విషయాన్ని గత అక్టోబర్‌లో ట్రంప్ సైతం స్పష్టం చేశారు. తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనూ చర్చకు దారితీశాయి.

ఈ విషయంలో ట్రంప్ మాజీ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బ్యానన్ ఆయనకు మద్దతు ఇచ్చారు. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటోన్నట్లు తెలిపారు. రాజ్యంగ నిబంధనలను అధిగమించడానికి అవకాశాలు, అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, వాటిని సరైన సమయంలో వెల్లడిస్తానని 'ది ఎకనామిస్ట్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+