సిరియాకు ట్రంప్‌ షాక్: 200 మిలియన్ డాలర్ల సహయం నిలిపివేత

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిరియాకు షాకిచ్చారు. ఇప్పటివరకు సిరియాకు అమెరికా ఆర్థిక సహయాన్ని చేస్తోంది. అయితే ఈ సహయాన్ని నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అంతర్యుద్దంతో సిరియా ఇబ్బంది పడుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఆ దేశాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు నెట్టేసే పరిస్థితి కన్పిస్తోంది.200 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

సిరియా నుండి తమ బలగాలను వెనక్కి రప్పించాలని కూడ అమెరికా నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు శనివారం నాడు అమెరికా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. సుమారు 200 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

Trump freezes $200M in Syria recovery funds: report

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అప్పటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టిల్లెసర్‌సన్ సిరియా పునర్నిర్మాణం కోసం ఆర్ధిక సహయం చేస్తానని ప్రకటించారు. కానీ, తాజాగా ఈ ప్రకటనపై అమెరికా వెనక్కు తగ్గింది.

ఉగ్రవాదుల దాడులతో పాటు అంతర్యుద్దం కారణంగా దెబ్బతిన్న నగరాల్లో మౌళిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి సదుపాయాల కోసం ఈ నిదులను ఉపయోగించనున్నట్టు గతంలో అమెరికా ప్రకటించింది.

అయితే ఈ సహయం చేయడం లేదని ప్రకటించింది. సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్దం కారణంగా సిరియా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సిరియన్ డెమోక్రటిక్ దళాలకు సహయంగా సుమారు 2 వేల మంది అమెరికా సైనికులు సిరియాలో పనిచేస్తున్నారు.వీరంతా కూడ స్వదేశానికి చేరుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+