భారత్ లో అధ్యక్ష ఎన్నికలు-ఓట్లేసిన 12.5 కోట్లమంది-ట్రంప్ విచిత్ర ట్వీట్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) ఇప్పటివరకూ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, నిర్ణయాలు చూస్తే ఆయన మానసిక స్దితిపై అక్కడక్కడా చర్చలు జరిగేవి. కానీ ఇవాళ ఆయన పెట్టిన ఓ ట్వీట్ చూస్తే నిజంగానే ఈ అనుమానాలు నిజమే అనిపించేలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన భారత్ లో ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నట్లు పేర్కొంటూ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఈ ట్వీట్ చేశారు.
"భారత అధ్యక్ష ఎన్నికల మొదటి విడతలో ఈ రోజు 12.5 కోట్ల మంది ఓటు వేశారు. ఓటింగ్ ముగిసిన కొద్దిసేపటికే, అదే రోజున ఫలితాలు వెలువడ్డాయి," అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్టు చేసారు. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో అసలు అధ్యక్ష ఎన్నికలు నేరుగా జరగవు. అలాంటి అధ్యక్ష ఎన్నికలు జరిగాయని, 12.5 కోట్ల మంది ఓటు కూడా వేశారంటూ ట్రంప్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ మాట ఎవరో ఓ అనామకుడు చెప్తే అది వేరు. కానీ ప్రపంచ పెద్దన్న గా భావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేయడం షాకింగ్ గా ఉంది.

ఇంతకీ దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ తన తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న నేపథ్యంలో. ట్రంప్ బ్రెజిల్ కు బదులు భారత్ ను ప్రస్తావిస్తూ ఇలా పోస్టు చేసినట్లు తెలుస్తోంది. కానీ భారతదేశంలో ఇవాళ అసలు ఏ ఎన్నికలూ జరగడం లేదు, ఇక అధ్యక్ష ఎన్నికలు జరగడం అనేది అసంభవం. అంతేకాకుండా, భారతదేశంలో అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్షంగా జరగవు, అంటే ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు, కానీ వారిచే ఎన్నుకోబడిన ప్రతినిధులు నాయకుడిని ఎన్నుకుంటారు. దీంతో ట్రంప్ పెట్టిన పోస్టుపై అమెరికన్లు సైతం చర్చించుకుంటున్నారు. ఆదివారం బ్రెజిల్ లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, ఆయనకు భావజాలపరంగా వ్యతిరేకి అయిన సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో మెజారిటీ ఓట్లు సాధించడంలో విఫలమవడంతో, కీలకమైన అధ్యక్ష ఎన్నికలు రన్‌ఆఫ్‌కు దారితీశాయి. బ్రెజిల్ కోర్టు.. బోల్సోనారోకు 56 మిలియన్లకు పైగా ఓట్లు రాగా, లూలాకు 53.6 మిలియన్ల ఓట్లు వచ్చినట్లు పేర్కొంది. రన్‌ఆఫ్ అక్టోబర్ 25న జరగనుంది.














Click it and Unblock the Notifications
