యూఎస్ లో భారతీయ విద్యార్థులను వణికిస్తున్న ట్రంప్ కొత్త బిల్లు!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ యూఎస్ లో చదువుకోడానికి వెళ్ళిన విద్యార్థులను వణికిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న వారు, చదువు పూర్తయిన వారు ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఓపిటి ని రద్దు చేయాలని బిల్లు ప్రవేశపెట్టడంతో ఏం జరుగుతుందోనని తెగ ఆందోళన పడుతున్నారు.

చట్టసభలో ఓపిటి రద్దు బిల్లు
అమెరికా ఫస్ట్ నినాదంతో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళతామని, అందులో భాగంగా ఇటీవల ఫెయిర్నెస్ ఫర్ హైస్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ పేరుతో ఓపిటిని రద్దు చేయడానికి బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టింది. ఓపిటి వల్ల అమెరికన్లు ఉపాధి కోల్పోతున్నారని, బాగా నైపుణ్యం ఉన్న అమెరికన్లకు ఇబ్బంది కలుగుతోందని, ఓపిటి కింద ఉన్నవారు తక్కువ జీతాలతోనైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటున్నారని, దీని కారణంగా యూఎస్ సిటిజన్లకు నష్టం జరుగుతుందని రిపబ్లికన్లు వాదిస్తున్నారు.

Trump new bill OPT repeal bill tension for Indian students in the US

భారతీయ విద్యార్థులలో ఆందోళన
ఈ క్రమంలోనే ఓపిటి రద్దు బిల్లును రిపబ్లిక్ అండ్ కాంగ్రెస్ సభ్యుడు పాల్ గోసార్ చట్టసభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఓపిటి బిల్లు రద్దు సాధ్యం కాదని యూఎస్ లోని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా భారతీయ విద్యార్థులలో మాత్రం ఆందోళన కనిపిస్తుంది.

చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించేది ఓపీటీ
చదువుకోవడం కోసం ఎఫ్ 1 వీసా మీద యూఎస్ వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత, 12 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసేందుకు ఈ ఓపిటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఓపిటి అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. విద్యార్థులు వారి చదువు పూర్తి కాగానే, దానికి సంబంధించిన పనిలో అనుభవం పొందడం కోసం ఇచ్చే అవకాశమే ఓపిటి.

దిక్కు తోచని స్థితిలో భారతీయ విద్యార్థులు
ఇప్పుడు దానిని కూడా రద్దు చేస్తే చదువు పూర్తి అయిన తర్వాత విద్యార్థులు యూఎస్ లో ఉండడానికి అవకాశం ఉండదు. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇండియాలో కంటే చాలా ఖరీదైన విద్యను లక్షల రూపాయలు చెల్లించి యూఎస్ లో చదివేది కేవలం అక్కడ ఉద్యోగ అవకాశాల కోసమేనని అంటున్నారు.

తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న విద్యార్థులు
అలా అవకాశం ఇవ్వనప్పుడు 35, 40 లక్షల రూపాయలను ఖర్చుపెట్టి యూఎస్ వెళ్లి చదువుకోవడం వల్ల అర్థం లేదని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వాళ్లకైనా, ఇప్పటివరకు అమెరికాకు విద్యాభ్యాసం కొరకు వచ్చిన వారికైనా ఓపిటి ఉంచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఓపీటీ రద్దు చేస్తే చదువుల కోసం యూఎస్ ఎవరొస్తారు?
ఒకవేళ యూఎస్ ఓపిటీని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటే ముందు ముందు విద్యార్థులు యూఎస్ రావాలా వద్దా అనేది ఆలోచించుకొని వస్తారని వారు అంటున్నారు. తాము ఎంతో డబ్బులు ఖర్చు చేసి చదువుకునేందుకు యూఎస్ వచ్చినందుకు తమకు ఓపిటిని కొనసాగించాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+