H1B Visa: ట్రంప్ దెబ్బకు ఫ్లైట్ దిగి జారుకున్న భారతీయులు-3 గంటలు లేట్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న హెచ్1బీ వీసా ఛార్జీల పెంపు నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయ నిపుణులతో పాటు ఇతర దేశాల్లో ఉండిపోయిన వారు కూడా దీనిపై ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వీసా ఫీజు పెంపు ప్రభావం కంపెనీలపై ఉంటుందని, దీంతో వారు భారతీయ ఉద్యోగుల్ని వదిలించుకుంటారనే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఫీజు కొత్తగా హెచ్1బీ వీసాలు తీసుకునే వారికే పరిమితం చేశారు.
అయినా భారతీయుల్లో భయాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇదే సమయంలో ట్రంప్ హెచ్1బీ వీసా ఛార్జీల పెంపుపై ప్రకటన చేసిన రోజు జరిగిన ఓ పరిణామం వైరల్ అవుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమానం బయలుదేరేందుకు సిద్దంగా ఉంది. ఇందులో చాలా మంది భారతీయులు ఉన్నారు. వారంతా ట్రంప్ ప్రకటన రాగానే వెంటనే విమానం దిగి పరుగులు తీశారు. ఎక్కడికక్కడ జారుకున్నారు. టికెట్లు తీసుకున్న వారు కూడా విమానం దిగి వెళ్లిపోయారు.

హెచ్1బీ వీసా ఛార్జీల పెంపుతో విదేశాల్లో ఉన్న వారు అమెరికాకు పరుగులు తీయడం ప్రారంభించారు. అలాగే అమెరికాలో ఉన్న విదేశీ నిపుణులు ఇతర దేశాలకు, స్వదేశాలకు తమ ప్రయాణాలు రద్దు చేసుకుని అక్కడే ఉండిపోయారు. ఇలా ప్రయాణాలు ప్రారంభించిన వారు కూడా చివరి నిమిషంలో వాటికి బ్రేక్ వేసుకున్నారు. ఇదే క్రమంలో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో తాజా ఘటన చోటు చేసుకుంది. ఇలా భారతీయులంతా ఒకరి తర్వాత ఒకరు విమానం దిగిపోవడంతో సదరు ఎమిరేట్స్ విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఇతర ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications