ఇక డ్రీమర్లకు నో చాన్స్: ఇదీ ట్రంప్ ప్రణాళిక.. ఊసే లేని ‘హెచ్ 1 బీ’ వీసా

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్/న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. తమ దేశంలో ఉద్యోగం పొందేందుకు వచ్చే విదేశీ డ్రీమర్లకు అడ్డుకట్ట వేసేందుకు వలస విధానంలో మార్పులు ప్రతిపాదించారు. ఉద్యోగార్థుల కలలు, వలసలపై సరికొత్త ప్రతిపాదనల్ని ముందుకు తెచ్చారు.

ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థను తేవాలని అమెరికా కాంగ్రెస్‌కు ప్రతిపాదించారు. గ్రీన్‌ కార్డుల్ని నియంత్రించాలనీ, గొలుసు వలసలకు అడ్డుకట్ట వేయాలనీ, డ్రీమర్ల పేరిట మైనర్ల అక్రమ రాకనూ అడ్డుకోవాలనీ స్పష్టం చేశారు. పలు అంశాలతో కూడిన తాజా ప్రతిపాదనల జాబితాను రెండు రోజుల క్రితం అమెరికా కాంగ్రెస్‌ ముందుంచారు. ట్రంప్ ప్రతిపాదనలను విపక్ష డెమోక్రటిక్‌ నేతలు తప్పుపట్టారు.

ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థ వల్ల అత్యంత నైపుణ్యం గల భారతీయ వలసదారులకు ప్రత్యేకంగా ఐటీ రంగానికి ప్రయోజనకరమేనని తెలుస్తోంది. కానీ కుటుంబ సభ్యులను ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రులను అమెరికాకు తెచ్చుకోవాలని భావిస్తున్న వేలమంది భారతీయ అమెరికన్లపై మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ ఐటీ వృత్తి నిపుణులు అమితంగా ఆసక్తి చూపే హెచ్‌ - 1 బీ వీసాల అంశాన్ని మాత్రం ట్రంప్‌ తన ప్రతిపాదనల్లో ప్రస్తావించలేదు.

 డీసీసీఏ హోదా చట్టాల్లో తాజా ప్రతిపాదనలు చేర్చాలని సూచన

డీసీసీఏ హోదా చట్టాల్లో తాజా ప్రతిపాదనలు చేర్చాలని సూచన

దేశ ప్రయోజనాల కోసమే వలస విధానంలో తాజా ప్రతిపాదనలు తెచ్చినట్లు ట్రంప్‌ ప్రకటించారు. అమెరికాలోకి అక్రమంగా తీసుకొస్తున్నట్లు భావిస్తున్న డ్రీమర్స్‌గా వ్యవహరించే చిన్న వయసు వలస దారులకు రెండేళ్ల పని అనుమతుల్ని కల్పించే డీఏసీఏ కార్యక్రమం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన ట్రంప్‌.. దీనిని దశల వారీగా తగ్గించేస్తామని గత నెలలోనే ప్రకటించారు. కాంగ్రెస్‌కు సమర్పించిన లేఖలోనూ డీఏసీఏ హోదాకు సంబంధించిన ఏ చట్టంలోనైనా తాజా ప్రతిపాదనల్ని చేర్చాలన్నారు. ఈ తరహా సంస్కరణలు అమలులోకి తేకుంటే అమెరికా కార్మికులు, పన్ను చెల్లింపు దారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న అక్రమ వలసలు, గొలుసు వలసలు కొనసాగుతూనే ఉంటాయనీ, వీటికి అంతం ఉండదని ట్రంప్‌ స్పష్టం చేశారు.

గ్రీన్ కార్డులకూ పాయింట్ల ఆధారిత వ్యవస్థ ఏర్పాటుకు పిలుపు

గ్రీన్ కార్డులకూ పాయింట్ల ఆధారిత వ్యవస్థ ఏర్పాటుకు పిలుపు

ప్రస్తుత వలస విధానం దేశ ప్రయోజనాల్ని కాపాడదనీ, ఇది నైపుణ్య ఆధారిత వలస వ్యవస్థకు కాక కుటుంబాలను విస్తరించే గొలుసు వలసలకే ప్రాధాన్యమిస్తోందని వాదించారు. దశాబ్దాలుగా సాగుతున్న తక్కువ నైపుణ్యాల వలసల కారణంగా వేతనాలు తగ్గి, నిరుద్యోగిత పెరిగిందనీ, వనరులపై భారం పడిందన్నారు. చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డుల వితరణలోనూ సరికొత్త పాయింట్ల ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. వ్యక్తులు ఆర్థికంగా తమకు తాము నిలదొక్కుకోవడం తదితర అంశాల ఆధారంగా గ్రీన్‌కార్డు వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. గ్రీన్‌కార్డు వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టడంతోపాటు మెక్సికోతో వివాదాస్పద సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు, దేశంలోకి ప్రవేశించే మైనర్లకు అడ్డుకోవడం వంటి ప్రతిపాదనలూ ట్రంప్‌ జాబితాలో ఉన్నాయి.

భాగస్వామి, పిల్లలకు మాత్రమే శాశ్వత నివాస హోదా

భాగస్వామి, పిల్లలకు మాత్రమే శాశ్వత నివాస హోదా

అమెరికా కాంగ్రెస్‌కు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ప్రతిపాదించిన సరికొత్త వలస విధాన ప్రణాళికలో అధికారులు కఠినంగా అమలు చేయాల్సిన 70 అంశాలను ఆయన ప్రతిపాదించారు. కానీ ఇందులో హెచ్‌-1బీ వీసాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ట్రంప్‌ ఆదివారం సాయంత్రం వైట్‌హౌస్‌లో ఆవిష్కరించిన ప్రణాళికను ప్రతిభ ఆధారిత వలస విధానం అంటున్న సంగతి తెలిసిందే. ఇందులో అమెరికాలో ఉంటున్న విదేశీయుల జీవిత భాగస్వామి, పిల్లలకు మాత్రమే గ్రీన్‌కార్డు లేదా శాశ్వత నివాస హోదా కల్పిస్తారు. తోబుట్టువులు, తల్లిదండ్రులను అనుమతించరు. ‘సమానత్వం, ఆర్థిక విజయం సాధించేందుకు విద్య, ఉద్యోగ అర్హత, ఇంగ్లిష్‌ స్పష్టంగా మాట్లాడే నేర్పు అంశాల ఆధారంగా గ్రీన్‌కార్డులు ఇవ్వడమే ప్రతిభ ఆధారిత వ్యవస్థ' అని వైట్‌హౌస్‌ వివరించింది.

 ప్రతిపాదిత గ్రీన్ కార్డుల వ్యవస్థతో మేలే

ప్రతిపాదిత గ్రీన్ కార్డుల వ్యవస్థతో మేలే

ప్రతిభ ఆధారిత వలస విధానం భారతీయులకు ప్రయోజనకరం అని కొందరు వాదిస్తుండగా మరికొందరు కాదంటున్నారు. ఏడాదికి ఒక దేశానికి 20,000 గ్రీన్‌కార్డులు మాత్రమే పరిమితం చేస్తే భారత్‌కు ప్రయోజనకరం అంటున్నారు. ఇప్పటికే అర్హతగల భారతీయులు, వృత్తి నిపుణులు 11 ఏళ్లుగా గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానం వస్తే ఈ ఎదురు చూపులు తప్పి త్వరగా గ్రీన్‌ కార్డు పొందుతారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Donald Trump's long list of immigration demands has landed with a thud among lawmakers hopeful for a deal to protect hundreds of thousands of young immigrants from deportation. The list of demands released late Sunday includes funding for a southern border wall and a crackdown on so-called sanctuary cities — items that are cheered by the president's most loyal supporters, but are non-starters among Democrats and could divide Republicans, who will have to come together on any deal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి