ట్రంప్ కు పుతిన్ అనూహ్య షాక్..! ఆ కీలక ఒప్పందం నుంచి అవుట్..!

అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా మధ్య అణు ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్దం ప్రారంభించి మూడేళ్లవుతున్నా ఇంకా దాన్ని కొనసాగించడం, పాశ్చాత్య దేశాల మాటను పెడచెవిన పెట్టడంతో అమెరికా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో ముందు రష్యాతో పాటు ఆ దేశం నుంచి చమురు కొంటున్న భారత్, చైనా వంటి దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రష్యా చుట్టూ తమ అణు జలాంతర్గాముల్ని మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయం రష్యాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. భూమిపై అమెరికాతో పోటీ పడలేకున్నా నీటిలో మాత్రం తమదే పైచేయి అని నమ్ముతున్న రష్యా తమ జలాంతర్గాముల బలం తెలియదంటూ హెచ్చరికలు చేసింది. అంతటితో ఆగకుండా 1987లో అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకుంది. ఈ కీలక ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది.

Trump s Submarine Move Prompts Russia to Exit Nuclear Arms Treaty With US

అణు ప్రయోగాల విషయంలో ఆచితూచి వ్యవహరించేందుకు వీలుగా 1987లో అమెరికాతో రష్యా ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ కుదుర్చుకుంది. దీంతో ఇన్నేళ్లుగా రష్యా ఎవరిపైనా అణ్వాయుధ ప్రయోగాలు కూడా చేయలేదు. ఉక్రెయిన్ తో యుద్ధంలో అణుప్రయోగం చేస్తుందని భావించినా రష్యా సంయమనం పాటించింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ తో యుద్ధం ఆపాలని తమపై అణు జలాంతర్గాముల్ని మోహరించి బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో రష్యా ఈ ఒప్పందం నుంచి వైదొలగింది. దీంతో ఇకపై స్వేచ్ఛగా అణు ప్రయోగాల నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది.

Trump s Submarine Move Prompts Russia to Exit Nuclear Arms Treaty With US

సోవియట్ నాటి ఒప్పందానికి కట్టుబడి ఉండే పరిస్థితులు అదృశ్యమయ్యాయంటూరష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన పరిస్దితి తీవ్రతకు అద్దం పట్టేలా ఉంది. రష్యా ఇకపై గతంలో విధించుకున్న స్వీయ-నియంత్రణ ఆంక్షలను పాటించడం లేదని తెలిపింది. రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ స్వల్ప, మధ్యస్థ-శ్రేణి అణు క్షిపణులపై తాత్కాలిక నిషేధాన్ని సడలించే విషంలో నాటో దేశాలే కారణమని ఆరోపించారు. దీనికి కౌంటర్ గా రష్యా మరిన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+