డొనాల్డ్ ట్రంప్ అల్లుడికి భారీ 'సీక్రెట్' షాక్, ఏదో జరుగుతోందని అనుమానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కష్నర్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన టాప్ లెవల్ సెక్యూరిటీ క్లియరెన్సులో విఫలమయ్యారు. అంటే అతను అమెరికాకు చెందిన అత్యంత కీలక రహస్య సమాచారాలను తెలుసుకునే అనుమతి ఉండదు.
అమెరికా అధ్యక్షులు ట్రంప్ కూతురు ఇవాంకా. ఇవాంకా భర్త కుష్నర్. ఇతను ట్రంప్ యంత్రాంగంలో కీలక వ్యక్తి. ట్రంప్‌కు సలహాదారుగా ఉన్నారు. అయితే కుష్నర్ ఉన్నతస్థాయి సెక్యూరిటీ క్లియరెన్సులో విఫలం కావడం గమనార్హం. ఇది చర్చనీయాశంగా మారింది.

వారు మాత్రం స్పందించలేదు
కుష్నర్ టాప్ సీక్రెట్/సెన్సిటివ్ కంపార్ట్‌మెంటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం కోల్పోయారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కానీ శ్వేతసౌధం అధికారులు లేదా డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనిపై స్పందించలేదు.

ఏదో జరుగుతోందనుకుంటున్నారు
కుష్నర్ ఉన్నత స్థాయి భద్రతపరమైన క్లియరెన్స్‌లో విఫలమవ్వడం అందరికీ పలు అనుమానాలు కలిగిస్తోంది. శ్వేత సౌధంలో ఏం జరుగుతుందోనని అనుకుంటున్నారు.

ఆయన వచ్చి వెళ్లగానే ఈ నిర్ణయం
కుష్నర్ మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని శ్వేతసౌధం పర్యటనకు వచ్చిన కొద్ది రోజుల్లోనే కుష్నర్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మార్పు వల్ల పదవిపై ప్రభావం పడదని
అయితే ఈ మార్పు వల్ల కుష్నర్ పదవిపై ఎలాంటి ప్రభావం పడదని అంటున్నారు. ట్రంప్ యంత్రాంగంలోని ప్రముఖ సహాయకుడు రాబ్ పోర్టెర్ పూర్తి సెక్యురిటీ క్లియరెన్స్ లేకుండానే కొన్ని నెలల పాటు పని చేయడంతో శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ క్లియరెన్స్ సిస్టమ్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు.
-
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
స్వయానా ట్రంప్ నోట -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications